సోషల్ మీడియా మానవ జీవితంలో భాగమైపోయింది. ఒకానొక సమయంలో పొద్దున లెగిస్తే మనుషులు దేవుని చిత్రపటాని గాని లేకపోతే తల్లిదండ్రుల మొహాలు చూసే వాళ్ళు. ప్రస్తుతం మాత్రం అందరూ సోషల్ మీడియా చూశాక మిగతావి చూస్తున్నారు. కేవలం కొద్ది సంవత్సరాల్లోనే మానవ జీవితంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది సోషల్ మీడియా. ఒక విధంగా చెప్పాలంటే మనిషి వాస్తవ జీవితం కంటే సోషల్ మీడియా లోనే ఎక్కువగా బతుకుతున్నాడు. అటువంటి సోషల్ మీడియాని ఉపయోగించే వాళ్లకి ఇది కచ్చితంగా బిగ్ బ్యాడ్ న్యూస్. కంగారు పడకండి ఇది మన దేశంలో కాదు పాకిస్తాన్ దేశానికి సంబంధించి. ఇక విషయంలోకి వెళితే ఇస్లామిక్ దేశాల్లో ఒకటైనటువంటి పాకిస్తాన్ దేశంలో సోషల్ మీడియా సంబంధిత సర్వీసులను నిలిపి వేయాలని కొన్ని సోషల్ మీడియా సంస్థలు అనుకుంటున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి.

 

దానికి కారణం ఏమిటంటే పాకిస్తాన్ దేశ ప్రభుత్వం తాజాగా అమలులోకి తీసుకువచ్చిన విధించినట్టు వంటి కఠినమైన నియమాలు. పాకిస్థాన్ దేశంలో సోషల్ మీడియా సర్వీసులను అనుమతించాలి అంటే ముందుగా ఆ దేశ భద్రతకు సంబంధించి కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఆ సర్వీస్ సంస్థకు సంబంధించి నటువంటి భద్రత కార్యాలయాన్ని దేశంలో నెలకొల్పాలి. అంతేకాకుండా అక్కడ అధికారులు సిబ్బందిని నియమించి దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని మానిటరింగ్ చేస్తూ ఒకవేళ బయట యూజర్లు ఎవరైనా దొంగిలించబడిన లేదా ఇతర దేశాలకి దొంగ దారులలో అమ్మడం వంటివి జరిగిన వెంటనే గుర్తించి ఆ వినియోగదారుని యొక్క వివరాలు మొత్తం పాకిస్థాన్ గవర్నమెంట్ అధికారులకు అందజేయవలసి ఉంటుంది.

 

ఒకవేళ సోషల్ మీడియా సంస్థ అధికారులు ఈ నియమాలను పట్టించుకోకుండా తమ స్వార్థం కోసం పని చేస్తే పాకిస్థాన్ ప్రభుత్వానికి భారీ జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో భాగాలైన ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, గూగుల్, వంటి సంస్థలు ఈ జరిమానాలను కట్టలేక పాకిస్తాన్ దేశం నుండి తమ మీడియా సంస్థలను బయటకు తీసుకొచ్చి వెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: