ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు కరోనా వైరస్.  చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచంలో 50 దేశాల్లో విస్తరించింది. ఈ వైరస్ వల్ల మనుషులు పిట్టల్లా రాలిపోతూ చనిపోతున్నారు. చైనా దేశంలో ఈ వైరస్ కొట్టడంతో ప్రపంచ దేశాలు అన్ని చైనా దేశం నుండి వచ్చే ఎగుమతులు దిగుమతులు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అంతేకాకుండా ఏ దేశానికి చెందిన ఆ దేశం తమ దేశస్థుల ను చైనా దేశం నుండి వచ్చేయాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఇప్పటికే చాలా మందిని ఆయా దేశాలు తమ దేశానికి చెందిన పౌరులను తీసుకు వెళ్లిపోవడం జరిగాయి. తాజాగా భారత దేశంలో కూడా ఈ కరోనా వైరస్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా 31 కరోనా వైరస్ అనుమానితులు అబ్జర్వేషన్ లో ఉన్నారు.

 

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో హైదరాబాదులో కూడా ఈ వైరస్ బయటపడటంతో హైదరాబాద్ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ముఖ్యంగా సాఫ్టువేర్ ఉద్యోగులకు ఈ వైరస్ సోకినట్లు వార్తలు రావడంతో ప్రముఖ కంపెనీలు అన్నీ ఉద్యోగస్తులకు వర్క్ ఎట్ హోం ప్రకటించాయి. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఈ నెల లో జరగనున్న క్రమంలో అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య పోటా పోటీ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి మంచి బలం ఉండటంతో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల నుండి తప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఏపీలో వార్తలు వినపడుతున్నాయి.

 

నేపథ్యంలో స్థానిక ఎన్నికల గురించి అఖిలపక్ష సమావేశంలో కరోనా వైరస్ అని చెప్పి ఏపీలో స్థానిక ఎన్నికలు జరుగకుండా ఉంటే బాగుంటుందని టీడీపీ ప్రతిపాదనను ఎన్నికల అధికారుల ముందు తీసుకొచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా వైరస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమీ లేదని అందువల్ల శనివారం నాడు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: