మాజీ సీఎం చంద్రబాబుకు ఇప్పుడు అంతా బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది.. ఆయన్ను ఏదోలా ఇరుకున పెట్టాలని ఓవైపు జగన్ సర్కారు పట్టుదల గా ఉంది. ఆయన పరిపాలన కాలంలోని లోపాలు, అక్రమాలపై సిట్ వేసి విచారణ సాగిస్తోంది. అందులో ఎక్కడ ఏం చిక్కుతుందో అన్న భయాందోళనలు ఓవైపు చంద్రబాబును వేధిస్తున్నాయి.

 

ఇప్పుడు ఇది చాలదన్నట్టు.. మరోవైపు నుంచి ఐటీ శాఖ నుంచి కూడా ముప్పు పొంచి ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సహాయం చేసినట్టు గతంలోనే కథనాలు వచ్చాయి. ఈ అంశంపై మోడీ, అమిత్ షా కూడా చాలా సీరియస్ గా ఉన్నారని ఆ కథనాలు తెలిపాయి.

 

 

ఇప్పుడు అందుకు అనుగుణంగానే.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ కు మరోసారి ఐటి శాఖ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని కోరింది. నిబంధనలకు విరుద్ధంగా రూ.550 కోట్లను విరాళంగా సేకరించడంపై విచారణకు హాజరు కావాలని సెక్షన్‌ 131 కింద ఐటీ శాఖఫిబ్రవరి 11న అహ్మద్‌ పటేల్‌కు నోటీసులు జారీ చేసింది.

 

 

అయితే ఆ నోటీసులకు స్పందించిన అహ్మద్ పటేల్.. అందరు రాజకీయ నాయకుల తరహాలోనే అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేదు. కానీ ఐటీ శాఖ రెండోసారి ఫిబ్రవరి 18న ఐటీ శాఖ జారీ చేసింది. అప్పుడు కూడా సేమ్ టు సేమ్.. ఇక మరోసారి మార్చి 5న ఐటీ శాఖ మరోసారి నోటీసు జారీ చేసింది. ఈసారి విచారణకు హాజరుకాకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అహ్మద్‌ పటేల్‌కు వార్నింగ్ ఇచ్చింది.

 

 

అయితే అహ్మద్‌ పటేల్‌ను విచారించిన తర్వాత తరువాత వరుసలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు చంద్రబాబు హవాలా మార్గంలో కోట్ల రూపాయలు పంపినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి చంద్రబాబు కు త్వరలోనే నోటీసులు వస్తాయని ప్రచారం జరుగుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: