ఇది నిజంగా ఏపీకి శుభవార్తే.. పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్న వైసీపీ సర్కారుకు నిజంగా నిధుల కొరత ఉంది. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు విడుదల కావడం లేదు. ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. ఇంత భారీ ప్రాజెక్టులు కట్టడం ఏపికి తలకు మించిన పనే.. ఈ సమయంలో కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

 

 

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2016–17 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లుగా సవరించేందుకు రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఇది నిజంగా వైసీపీ సర్కారుకు.. ఏపీ ప్రజలకు శుభవార్తే. కేంద్ర జల్‌శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్‌మోహన్‌ గుప్తా నేతృత్వంలోని ఆర్‌ఈసీ ఢిల్లీలో సమావేశమైన సమయంలో ఈ విషయం వెల్లడించింది. ఆర్‌ఈసీ ఇచ్చే నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ కేంద్ర మంత్రిమండలికి పంపుతారు. ఇక ఈ నివేదికపై కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేస్తే.. ఏపీకి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంది.

 

 

పోలవరంలో సవరించిన అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా ఆర్‌ఈసీ ఖరారు చేసింది. దీని ప్రకారం... జల విద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు. ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయం రూ.43,601.1 కోట్లు. ఏప్రిల్‌ 1, 2014 నుంచి ఇప్పటి వరకూ రూ.8,507.26 కోట్లు విడుదల చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే పోలవరానికి కేంద్రం ఇంకా రూ.29,957.97 కోట్లను విడుదల చేయాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: