బ్రదర్ జీవితం గురించి ఆలోచిస్తే అది చాలా పెద్దదిగా తోస్తుంది.. ఏ ఆలోచన చేయని వారికి చిన్నదిగా అనిపిస్తుంది.. అంటే జీవితంలో ఎలా బ్రతకాలి అని విలువలతో కూడిన ఆలోచనలు చేసే వారికి జీవితం విలువ తెలుస్తుంది.. అదే ఏ పనిపాటలేక సోమరిగా తిరుగుతూ, విలువలంటే తెలియని జీవితాన్ని గడిపే వాడికి ఈ విలువల కోసం ఎంతగా చెప్పిన అర్ధం కాదు.. ఇక ఈ మధ్యకాలంలో మనుషులు ఎలా తయారు అయ్యారంటే నేను బ్రతికితే చాలు, నా పక్కనున్నోడు ఎలా చస్తే నాకేంటనే స్వార్ధం అనువణువునా నిండిపోయింది..

 

 

ఎవరైన ఓ మంచిపని చేయాలని ముందుకొస్తే అతనిలో ఉన్న ఆలోచనను మాటలతో తుంచే మనుషులు ఉన్న ఈ లోకంలో, ఒకరికి మేలు చేయాలంటే పదే పదే ఆలోచించవలసిన పరిస్దితులు కలుగుతున్నాయి.. ఇక ఆడపిల్లల విషయానికి వస్తే, అందంగా అలంకరించుకోవడం. తమ అందానికే ఎక్కువ సమయం కెటాయించుకోవడం.. బాయ్ ఫ్రెండ్స్‌తో షికార్లు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేయడం.. ఇదే లోకం ఇప్పటి యువతకు.. కాని అందరు ఒకేలా ఉండరు కదా.. ఇదిగో ఇక్కడ ఓ 80 మంది అమ్మాయిలు చేసిన పని తెలిస్తే సరైన ఆలోచనలతో బ్రతకని వారు సిగ్గుపడవలసి వస్తుంది..

 

 

ఇంతకు వీరు ఏం చేసారంటే జుట్టు రాలిపోయే కాన్సర్ పేషెంట్లకు తమ జుట్టును డొనెట్ చేసారు..తమ జుట్టును విగ్గుగా పెట్టుకునేందుకు ఇలాంటి వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నదే ఆలస్యం దీన్ని అక్షరాల ఆచరించారు... ఒక్కరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా మొత్తం 80 మంది అమ్మాయిలు తమ జట్టు ఇవ్వాలని డిసైడయ్యారు. ఈ గొప్ప కార్యక్రమానికి వేదికైంది తమిళనాడు... కోయంబత్తూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీ... అమ్మాయిలంతా తమ జుట్టు మొత్తం ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు. కానీ డాక్టర్లు మాత్రం... మొత్తం జుట్టు వద్దని... కొంత కొంత ఇస్తే సరిపోతుందని తెలిపారు. దాంతో అమ్మాయిలు... తమ జుట్టు లోంచీ... కొంత ఇచ్చారు.

 

 

ఇక త్వరలోనే ఆ జుట్టుతో కాన్సర్ పేషెంట్లకు విగ్స్ తయారు చేసి ఇవ్వబోతున్నారు. అయితే ఈ 80 మందినీ చూసి... మరో 120 మంది అమ్మాయిలు తామూ జుట్టు ఇస్తామంటున్నారు. ఇంత కంటే ప్రేరణ ఏం కావాలి.. నిజంగా ఇదొక గొప్ప సేవగా భావించవచ్చూ.. ఎప్పుడు తింటున్నామా బ్రతుకుతున్నామా, ఎంజాయ్ చేస్తున్నామా, మోసాలతో ముందుకు వెళ్లుతున్నామా అని ఆలోచించే ప్రతి వారు ఇలాంటి మంచి పనులను చేసే వారిని చూసి కొంతైన సిగ్గుపడాలి అని అంటున్నారు కొందరు నెటిజన్స్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: