తెలుగుదేశం  అంటేనే హడావుడికి పెట్టింది పేరు. ఎపుడూ ఉన్నదీ లేనిదీ చెబుతూ  మీడియాలో కనిపించాలన్నది తమ్ముళ్ళ ఆరాటం. వారికి  ఆ రకంగా ట్రైనింగ్ కూడా  ఉంటుంది. ఏదో ఒక బురద విపక్షలో ఉంటే జల్లుతారు. అదే అధికారంలో ఉంటే తమ గొప్పలు చెప్పుకుంటారు. మొత్తానికి మీడియాలో నానడం టీడీపీకి తెలిసిన గొప్ప విద్య. అలాంటి టీడీపీలో ఇపుడు పెద్దగా సౌండ్ లేకుండా పోయింది.

 

దీనికి కారణం ఏంటంటే జగన్ సైలెంట్ గా పెద్ద తలకాయలకు వరసగా టిక్కులు పెట్టుకుంటూ పోతున్నాడుట. దాంతో  మాజీ మంత్రులు, సామంతులు, తెల్లారి లేచి జగన్ మీద పెద్ద గొంతుతో విరుచుకుపడే నేతలంతా కూడా ఇపుడు ఎక్కడా కిక్కురుమనడంలేదు.

 

తన బస్సులను ఇష్టానుసారాన  తిప్పుకుంటూ ఎపుడూ కస్సుబుస్సులాడే జేసీ దివాకరరెడ్డి ఒక్కసారిగా సైలెంట్ కావడం వెనక ఆయన  చుట్టు జగన్ బిగించిన ఉచ్చు కారణం అంటున్నారు. ఇక ఇద్దరు మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలకు అమరావతి రాజధాని ఇన్సైడింగ్ ట్రేడింగ్ ఒక ఇబ్బందిగా మారిందట.

 

నాటి వ్యవసాయమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి  కూడా పాత బాధలు వెంటాడుతున్నయనుకుంటే పోలవరం అవినీతిపైన విచారణలు దేవినేని ఉమకు చిక్కులు తెస్తున్నాయి. ఇక ఉత్తరాంధ్రాలో చూసుకుంటే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాం లో ఉన్నట్లుగా విజిలెన్స్ ఎంఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్  తేల్చడంటో ఆయన సూపులో పడ్డారు.

 

ఇదే ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి పెద్ద దిక్కుగా ఉన్న  విజయనగర రాజుల వంశీకుడు పూసపాటి అశోక్ గజపతిరాజుని ఏకంగా సింహాచలం దేవస్థానం చైర్మన్ పదవి, మాన్సాస్ చైర్మన్  పదవి నుంచి తప్పించడంతో ఆయన సైతం ఇరకాటంలో పడ్డరని అంటున్నారు. ఇలా ఎక్కడ చూసుకున్నా సీనియర్ల మీద జగన్ సర్కార్ బిగిస్తున్న ఉచ్చులొఈ పడి పచ్చ పార్టీ నాయకులకు నోట మాట రావడంలేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: