తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్యాత్మిక దివ్యధామం. కలియుగ దైవంగా భక్తుల కొంగుబంగారంగా శ్రీవారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అలరారుతూ ఉంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకుని భక్తులు శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి కృపకు పాత్రులు అవుతూ ఉంటారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. ఇక తిరుమలకు వచ్చే భక్తుల కోసం ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఎన్నో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. ఎప్పుడు ఎంతో శుద్ధిగా ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం. పవిత్రతకు నిలయంగా ఉంటోంది. 

 

 

 కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు భంగం కలిగేలా చేశారు. కలియుగ దైవంగా భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమైన దేవుడిగా ఏడుకొండలపై విరాజిల్లుతున్న శ్రీవారి కొండపైనే మద్యం సేవిస్తూ మాంసం తిని అపచారం మూటగట్టుకున్నారు. ఈ ఘటన తిరుమల లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... తిరుమలలోని ఎఫ్ టైప్  క్వార్టర్స్ దగ్గర స్థానిక బాట గంగమ్మ ఆలయం సమీపంలో కొంతమంది గుంపు గా కూర్చొని మద్యం సేవిస్తున్నారు అని  తిరుమల వన్టౌన్ పోలీసులకు సమాచారం అందింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ 14మంది మద్యం సేవిస్తూ కనిపించగా వారందరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. 

 

 

 తిరుమల కొండపై మద్యం సేవిస్తున్న వారిని తిరుమల,  తిరుపతికి చెందిన వ్యక్తిలుగా  గుర్తించారు పోలీసులు. వారి దగ్గర నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా తిరుమల కొండపై వీరు మాంసం వంటకాలను కూడా తినే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు. తిరుమల కొండపై మద్యం సేవించిన ఈ 14 మందిపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టం కింద కేసు  నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే మద్యం బాటిల్ మాంసం తిరుమల కొండ పైకి ఎలా వచ్చింది అనేదానిపై పోలీసులు దృష్టి  పెట్టారు.. ఈ దిశగా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పవిత్రతకు నిలయమైన తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: