దేశలో ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిద్ర లేమి వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.  ముఖ్యంగా హైవే రోడ్లపై ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఈ రోడ్డు ప్రమాదాలు ప్రస్తావన వస్తూనే ఉన్నాయి.  తాజాగా బీహార్‌లో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  ముజఫర్‌పూర్‌లోని కంటి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-28పై  జరిగిందీ ఘటన. స్కార్పియో కారు-ట్రాక్టర్ ఒకదాన్నొకటి వేగంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రిలో చెర్పించి చికిత్స అందిస్తున్నారు.  అయితే ఈ ప్రమాదంలో కారు లో ఉన్నవారే ఎక్కువగా చనిపోయినట్లు తెలుస్తుంది.

 

అయితే వారి వివరాలు తెలియాల్సి ఉందని... అంటున్నారు. అయితే ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ ప్రమాదం లో ఎవరు తప్పు చేశారు.. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అయ్యిందా అని పోలీసులు దర్యాప్తులో చేసి చెబుతామని అంటున్నారు.  అయితే  క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  మరణించిన వారి వివరాలు తెలియగానే చెబుతామని అంటున్నారు.. ఈ రోడ్డు ప్రమాదం లో స్కార్పియో కారు నుజ్జు నుజ్జు కావడంతో వాహనాన్ని పక్కకు జరిపి మృత దేహాలను పక్కకు తీశారు.   

 

గాయపడ్డవారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉందని వైద్యులు అంటున్నారు.  ఓ వైపు రోడ్డు ప్రమాదాల తీవ్రతపై ఎన్నో నియమ నిబంధనలు రోడ్డు రవాణా సంస్థలు చెబుతున్నా ప్రమాదాలను మాత్రం అరికట్ట లేక పోతున్నారు.  ముఖ్యంగా డ్రైవర్ల నిర్లక్ష్యం ఇందుకు కారణం అని.. అన్యాయంగా ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: