తన సొమ్మును తిరుమలలో కొలువై ఉన్న దేవదేవుడు శ్రీ వెంకటేశుడే కాపాడుకున్నాడు. కాపాడుకోవటం కూడా ఏ లక్ష రూపాయలో లేకపోతే కోటి రూపాయలో కాదు. ఏకంగా  1300 కోట్ల రూపాయలు. అవును అక్షరాల 1300 కోట్ల రూపాయలను దేవదేవుడు సకాలంలో కాపాడుకోకపోతే ఈ పాటికి ఈ డబ్బంతా గోవిందా అయిపోయుండేదే అనటంలో సందేహం లేదు. అవును ఇదంతా ఎస్ బ్యంకు సంక్షోభం గురించే మాట్లాడుకోవటం. ఎస్ బ్యాంకులో ఉన్న వందల కోట్ల రూపాయలను తిరుమల తిరుపతి దేవస్ధానం (టిటిడి) పోయిన నెలలోనే విత్ డ్రా చేసేసుకుంది.

 

దివాలా అంచుల్లో ఉన్న ఎస్ బ్యాంకు దేశంలో ఎంత సంచలనంగా మారిందో అందరూ చూస్తున్నదే.  ఎస్ బ్యాంకు ఏర్పాటయిన తర్వాత యాజమాన్యంలోని కీలక వ్యక్తులు కొందరు చంద్రబాబునాయుడును కలిశారు. వాళ్ళ మధ్య చర్చల ఫలితంగా రూ. 1300 కోట్లను ఎస్ బ్యాంకులో టిటిడి డిపాజిట్ చేసింది. మొత్తం రూ. 5 వేల కోట్లను టిడిపి ప్రభుత్వం ఒత్తిడి ఫలితంగానే టిటిడి వివిధ ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసింది.  

 

చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం ఆ నిధులన్నీ ప్రైవేటు బ్యాంకుల్లోనే డిపాజిట్ల రూపంలో ఉండిపోయాయి. సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎస్వీ సుబ్బారెడ్డి టిటిడి ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాడు. వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై చర్చలు జరిగాయి. కారణాలు ఏవైనా కానీంగా ఎస్వీ సుబ్బారెడ్డికి ఎందుకో అనుమానం వచ్చింది.

 

దాంతో ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లన్నింటినీ విత్ డ్రా చేసేసి ప్రభుత్వ బ్యాంకుల్లోనే పెట్టాలని నిర్ణయించారు. దాంతో వెంటనే పోయిన నెలలోనే ఎస్ బ్యాంకులో ఉన్న మొత్తం 1300 కోట్లను విత్ డ్రా చేసేసి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టారు. ఇది జరిగిన నెల తర్వాత చూస్తే బ్యాంకు దివాలా అంచుల్లో పడిపోయింది. ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న మొత్తం 5 వేల కోట్లలో ఇప్పటికి 3 వేల కోట్లను విత్ డ్రా చేసేశారు. ఎస్ బ్యాంకు దెబ్బకు మిగిలిన నిధులను కూడా తీసేస్తున్నారు. చూశారా తన నిధులను దేవదేవుడు తానే ఎలా కాపాడుకున్నాడో.

మరింత సమాచారం తెలుసుకోండి: