ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా మహ్మారి ప్రభావంతో రోజు రోజుకీ మరణాలు పెరిగిపోతున్నాయి.   కరోనా విష కౌగిలిలో ప్రపంచం పలు రకాలైన నష్ట కష్టాలకు గురి అవుతున్నది. దేశ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్న తీరు, విద్యారంగానికి కలుగుతున్న విఘాతం భయాందోళనలు కలిగిస్తున్నాయి.  ఈ కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థలే కాదు.. 13 దేశాల్లోని 29 కోట్ల మంది విద్యార్థుల చదువు కరోనా వల్ల దెబ్బ తింటున్నది.  అంతర్జాతీయంగా ఇంత పెద్ద స్థాయిలో చదువులకు విఘాతం కలగడం ఇదే మొదటిసారని ఇంతకు ముందెప్పుడూ ఇంత విపత్తు సంభవించలేదని యునెస్కో (ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ) ప్రకటించింది.

 

ఒక్క చైనాలోనే కరోనా వల్ల 23 కోట్ల 30 లక్షల మంది విద్యార్థుల చదువులు దెబ్బ తిన్నాయి. అంతే కాదు ఈ ప్రభావం భారత్ లో కూడా పడుతుంది.  కొన్ని పాఠశాలలు ఇప్పటికే మూయించి వేశారు.  అసలే ఇప్పుడు పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన, ఆందోళన చెందుతున్నారు.  వారం రోజుల క్రితం చైనాలో రోజుకి 400కు పైగా కరోనా కేసులు నమోదయ్యేవి.  అయితే ఈ మద్య చైనాలో కరోనా ప్రభావం కాస్త తగ్గుతున్నట్లు అనిపిస్తుంది.  ఎందుకంటే గత మూడు రోజులుగా ఈ సంఖ్య 140కు తగ్గిపోయింది.  కాకపోతే ఈ ప్రభావం వల్ల ఇతర దేశాల్లో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.  ఎంత టెక్నాలజీ ఉన్నా కరోనా కరాళనృత్యాన్ని మాత్రం అరికట్టలేక పోతున్నారు.  కేవలం భద్రతా చర్యలు మాత్రమే తీసుకోగలుగుతున్నారు. 

 

వ్యాధి భయంతో పనులు మానేసి జనం ఇళ్లకే పరిమితం కావడం వల్ల వారి ఆదాయాలు దెబ్బ తిన్నాయి. దాని ప్రభావంతో సరకులకు గిరాకీ పడిపోయింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. టూరిజం మహా పతనానికి గురయింది.  ఇప్పటికే ముఖ ముసుగుల ధరలు రెట్టింపు అయిపోయిన దృశ్యాన్ని చూస్తూనే ఉన్నాము. కొంత మంది కరోనా వ్యాధి పేరు చెప్పి అమాయకులను మోసం చేస్తూ డబ్బు గుంజే ప్రయత్నాలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీపై కూడా తీవ్ర ప్రభావం చూపెడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: