నేడు ప్రపంచ దేశాలను అతలా కుతలం చేస్తున్న అంశం కోవిద్ 19 (కరోనా వైరస్) అని అందరికి తెలుసు. సుమారుగా ప్రపంచం మొత్తం 89 దేశాలకు ఈ మహమ్మారి పాకింది అంచనా! మన దేశంలో ఇప్పటి వరకు 30 కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య నిపుణులు యెంత ప్రయత్నించినా దీనికి నివారణ మార్గం కనుగొనలేక పోయారు. కేవలం నియంత్రించడం తప్ప, ఇంకేమి చేయలేమని అందరూ చేతులెత్తేశారు.

 

ఇక దాని పుణ్యమాని ప్రపంచ దేశాలకు అన్ని విధాలుగా.. సుమారు అన్ని రంగాల్లోనూ బోలెడంత నష్టం వాటిల్లింది. దీనితో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ బేజారుమంటోంది. అందువలన ఎంత వీలైతే అంత త్వరగా దీనికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అన్ని దేశాలు తమ తమ పనిలో నిమగ్నమైనాయి. మన దేశంలో కూడా కరోనాకు విరుగుడు కనిపెట్టేందుకు ఇప్పటికే ట్రయిల్స్ స్టార్ట్ అయ్యాయి. అది మరెక్కడో కాదు, మన హైదరాబాద్‌లోనే దీనికి సంబంధించిన రీసెర్చ్ మొదలైనట్లు తాజా సమాచారం. 

 

ఎబోలాకున్న లక్షణాలే కరోనాకు ఉన్నాయంటున్నారు మన శాస్త్రవేత్తలు. ఈ రెండు వైరస్ లక్షణాలు సుమారుగా ఉండడంతో, ఇంతకుముందు కనిపెట్టిన ఎబోలా వ్యాక్సిన్‌ డేటాతో కరోనాకు మందు కనిపెట్టవచ్చని మన వైద్యులు సూచిస్తున్నారు. ఈమేరకు హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా ఇండస్ట్రీలో ప్రయోగాలు ముమ్మురమయ్యాయి. రెమ్‌డెసీవర్‌ ఫార్మా డేటాతో కరోనాకు మందును సిద్ధం చేస్తున్నారు. ఈ పార్మా కెమికల్‌ను ఎబోలా వ్యాప్తి చెందినప్పుడు ఆఫ్రికాలో ప్రయోగించిన సంగతి అందరికి తెలిసినదే. 

 

ఇప్పుడు కరోనాకు అదే డేటా సరిపోతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈమేరకు గిలియడ్ సైన్సెస్‌ అనే కంపెనీ 15మంది శాస్త్రవేత్తల బృందంతో కలిసి కరోనాకు ఔషధాన్ని తయారు చేసే పనిలో బిజీగా ఉంది. మన హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కరోనాకు మందు కనిపెట్టే పనిలో సమాయత్తమైంది. ఎబోలా యాంటీవైరల్ డ్రగ్ పద్దతిలో దీన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వినికిడి. ప్రస్తుతం 10 నుంచి 50గ్రాముల మందును తయారు చేసి పెడతామని, మెడికల్ ట్రయల్స్‌లో సక్సెస్ అయితే, బల్క్‌గా విడుదల చేస్తామని ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపినట్లు తాజా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: