భారతదేశంలో హంతుకులు వారికి నచ్చినట్లుగా జీవించ వచ్చనే ట్రెండ్ క్రియేట్ చేసారు ఈ దోషులు. చట్టాలు ఎన్ని ఉన్నా, వాటన్నీంటిని కట్టకట్టి అటకమీద పెట్టండని వెక్కిరిస్తున్నారు.. పట్టిన దుమ్మును దులపడానికే ఇండియన్ చట్టాలు కానీ దోషులను శిక్షించడానికి పనికి రావంటూ పదే పదే గుర్తుకు చేస్తున్నారు.. ప్రజల సహనాన్ని, చట్టాల లోతులను నిశితంగా పరిశీలిస్తున్నారు.. ఇంతగా చెప్పేది ఎవరి కోసమంటే, ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుని ఏళ్ల తరబడి జీవిస్తూ, పందుల మాదిరిగా బలిసిన నిర్భయ దోషుల గురించే.. ఎప్పుడో చంపవలసిన వారిని అనవసరంగా బ్రతికిస్తున్నారు..

 

 

వీరేమి స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులు కాదుకదా.. లేదా పేద ప్రజలకోసం త్యాగాలు చేసిన మహాత్ములు అంతకంటే కాదు. మరి ఇంతకాలం నుండి అనవసరంగా ఈ హంతకులను గాడిదల్లా మేపుతూ, పందుల్లా బలిసేలా చేశారు.. ఇప్పటికైనా మేము తప్పుచేశాం అనే ఒక్క పదం కూడా ఇంతవరకు వారి నోటినుండి బయటకు రాలేదు.. ఏదో గొప్పపని చేసిన వారి మాదిరిగా ఫీలవుతూ, చట్టాన్ని బంతిలా చేసి ఆడుకుంటున్నారు.. వీరి ముఖాల్లో కించిత్ పశ్చాతాపం... పాపభీతి కూడా ఏమాత్రం కనబడటం లేదు.. అంతే కాకుండా కోర్టులు తమకు విధించిన మరణశిక్ష అమలు కాకుండా ఉండేందుకు.. చట్టంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయో.. వాటన్నింటిని వినియోగించుకునే తీరు చూస్తే... బాధితుల కంటే బాధ్యులకు ఇన్ని ఛాన్సులు ఉన్నాయా? అన్న భావన కలగటం ఖాయం..

 

 

ఇక మరొక సారి ఉరిశిక్షను వాయిదా వేయించడానికి దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ కొత్త వాదన వినిపించేందుకు సుప్రీంకోర్టు తలుపు మరోసారి తట్టారు. న్యాయవాదులు తనను తప్పుదోవ పట్టించిన కారణంగా న్యాయపరంగా తనకున్న హక్కులన్నింటిని మరోసారి దాఖలు పరచాలని కోరుతూ ఎం.ఎల్. శర్మ అనే న్యాయవాది చేత పిటిషన్ దాఖలు చేశాడు. ఇదే కాకుండా ఇప్పటివరకూ జారీ చేసిన అన్ని ఉత్తర్వుల్ని కొట్టివేయాలని... రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించటాన్ని కూడా రద్దు చేయాలన్నాడు.

 

 

ఇక సోమవారం ఈ తాజా పిటిషన్ పై విచారణ జరగనుంది. నిజంగానే న్యాయవాదులు వీరిని తప్పుదోవ పట్టించి ఉంటే.. ఈ పాటికి ఉరిశిక్ష అమలు జరిగి ఏళ్లు గడిచేది కావచ్చూ.. ఇలాంటి నరహంతకులను న్యాయసూత్రాల ద్వారా శిక్షించాలంటే ఇదిగో ఇలాంటి దరిద్రాలే ఎదురవుతాయన్న విషయం నిర్భయ దోషుల్ని చూస్తే తెలుస్తుంది..

 

 

అంతే కాకుండా ఇలాంటి వెధవలకు వత్తాసు పలుకుతున్న న్యాయవాదులు ఒకటి గమనించాలి.. మీ కూతురికి, మీ చుట్టాల్లోని అమ్మాయికో ఇలా జరిగితే అప్పుడు కూడా ఇలాంటి వెధవల తరపున ఇలాగే వాదిస్తారా అని ఆవేదనతో కొందరు ప్రశ్నిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: