చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ అక్కడి దేశప్రజలను అల్లాడించింది. ఇదేకాకుండా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించింది. దీంతో కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా. . భారత దేశానికి విస్తరించిన కరోనా తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్‌ లో కూడా కరోనా వైరస్ తాకిడి ఉంది. ఈ నేపథ్యంలో వైరస్ ను అరికట్టడానికి తెలంగాణా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వివిధ శాఖలు, వైద్య అధికారులతో చర్చలు, సమావేశాలు జరుపుతున్నారు. 

 

 

ఈ సమావేశాల కోసం, కరోనా బాధితులను పరామర్శించటం, వారి ఆరోగ్య వివరాలను తెలుసుకునేందుకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తరచూ గాంధీ ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రులకు వెళ్తూ వస్తుంటారు. అయితే.. ఆయన ఆసుపత్రులలో కరోనా వార్డులను పరిశీలిస్తుంటారు. ఈ నేపథ్యంలో మంత్రి భార్య ఆయనకు కొన్ని సూచనలు, సలహాలు చేసినట్లు సమాచారం.

 

 

కాగా.,ఆయన మంత్రి అయినందువల్ల విధుల పరంగా రోజూ ఎక్కడెక్కడో తిరుగుతున్నారని, ఆసుపత్రుల్లో వైద్యులు, రోగులతో సన్నిహితంగా మెలుగుతుండటంతో ఇంటికి వచ్చే ముందు ఆఫీసులోనే స్నానం చేసి రావాలని మంత్రి కుటుంబసభ్యులు ఆయనకు సూచించారట. ఈ విషయాన్ని ఆయనే శుక్రవారం స్వయంగా వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఈటల మాట్లాడారు. 

 

 

 

ఆయన మాట్లాడుతూ.. కరోనా సోకకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం తప్పనిసరి అని తెలిపారు. వైరస్‌ సోకిన వారు తప్ప, మిగతావారు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ప్రజలకు ఆయన సూచించారు. గాంధీ ఆస్పత్రిలో ఐసొలేషన్‌ వార్డు ఏర్పాటును ఆయన సమర్థించారు. ఈ ప్రత్యేక వార్డును అక్కడి నుంచి తరలించాలన్న ఆలోచనను ఆయన కొట్టిపారేశారు. వైద్య వృత్తిలో ఉన్నప్పుడు రోగులకు అందుబాటులో ఉండి చికిత్స చేయాలని.. వైద్యులు దేవుళ్లతో సమానమని గుర్తుచేశామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: