గత కొన్ని రోజులుగా రూపాయి విలువ క్రమక్రమంగా పడిపోతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే భారతీయులు ఎవరైనా రూపాయి విలువ పడిపోతే కాస్త ఆందోళన చెందుతారు. కానీ ఇక్కడ మాత్రం రూపాయి విలువ పడిపోవడం ద్వారా యూఏఈ లోని భారత ప్రవాసులు పండగ చేసుకుంటున్నారు. రూపాయి విలువ పడిపోవడం వాళ్ళకి వరంగా మారిపోయింది. అయితే శుక్రవారం ఒక్క యూఏఈ దిర్హామ్  ఏకంగా 20.07 పలికింది. దీంతో యూఏఈ లోని ప్రవాస భారతీయులందరూ... స్వదేశంలో ఉన్న తమ కుటుంబీకులకు డబ్బులు పంపించేందుకు  ఎక్కువగా మొగ్గు చూపారు. రూపాయి విలువ నిలకడగా ఉన్న మొన్నటివరకు... డబ్బులు పంపించాలా వద్ద అనే అయోమయం లో ఉన్న ప్రవాస భారతీయులు రూపాయి విలువ ఒక్కసారిగా పెరిగిపోవడంతో... డబ్బులు పంపించేందుకు ఎగబడ్డారు. ఏకంగా  శుక్రవారంనాడు యూఏఈలో ఉంటున్న ఎన్నారైలు ఆల్ క్లోజ్  మాల్ లోని ఆల్ అన్సారీ  ఎక్స్చేంజ్ వద్ద భారీ మొత్తంలో క్యూ కట్టారు.. 

 

 

 ఈ సందర్భంగా దుబాయ్ లో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ఓ ప్రవాస భారతీయుడు అహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ... ఈ నెల జీతం తన చేతికి వచ్చినప్పటికీ పనిలో పడి కుటుంబీకులకు పంపించ లేక పోయాను అంటూ తెలిపాడు. కానీ గత కొన్ని రోజులుగా క్రమక్రమంగా రూపాయి విలువ తగ్గుతూ ఉండటం గమనించిన తాను... శుక్రవారం ఏకంగా యూఏఈ దిర్హామ్  20.07 రూపాయలు  పలకడంతో... స్వదేశానికి డబ్బులు పంపించాలని నిర్ణయించుకుని... నగదు పంపించాను అంటూ చెప్పుకొచ్చాడు.ఈ సారీ కొంత  మొత్తం ఎక్కువగానే పంపించాను అంటూ చెప్పాడు ఆ ప్రవాస భారతీయుడు. ఈసారి కాస్త ఎక్కువ మొత్తం పంపించడానికి గల కారణం రూపాయి విలువ క్రమ క్రమంగా పడిపోవడం అంటూ ప్రవాస భారతీయుడు అహ్మఫ్  తెలిపాడు. రూపాయి విలువ  ఒక్కసారిగా పడిపోవడంతో... స్వదేశానికి డబ్బులు పంపేందుకు ఇదే  సరైన సమయం అని భావించి డబ్బులు పంపాను అంటూ మరో ప్రవాస భారతీయులు కూడా చెప్పుకొచ్చారు.

 


 ఏదేమైనా రూపాయి విలువ పడిపోవటం   మాత్రం ఈ ప్రవాస భారతీయులకు పండగలా మారిపోయింది. రూపాయి విలువ ఒక్కసారిగా పడిపోవడం ప్రవాస భారతీయులు అందరికీ వరంలా మారి పోయింది అంటూ అక్కడి ప్రవాస భారతీయులు చెబుతున్నారు. సరిగ్గా నెల ఎండింగ్ సమయంలో  జీతాలు చేతికి వచ్చే టైమ్ కి  ఒక్కసారిగా రూపాయి విలువ తగ్గిపోవడంతో ఇంటికి ఎక్కువ మొత్తంలో డబ్బు పంపించగలిగాము అంటూ  ప్రవాస భారతీయులు చెబుతున్నారు. ఖర్చులు పోను మిగిలినదంతా స్వదేశానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటూ చెప్పుకొస్తున్నారు ప్రవాస భారతీయులు. ఇక ఒక్కసారిగా రూపాయి విలువ పడిపోవడంతో ఎక్కువ మొత్తంలో ప్రవాస భారతీయులు స్వదేశంలోని తమ కుటుంబాలకు డబ్బు పంపించేందుకు ఎక్కువ మొగ్గు చూపడంతో యూఏఈ లోని మనీ ఎక్స్చేంజ్ ఏజెన్సీలు జనాలతో కిక్కిరిసి  పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: