ఏపీ రాజకీయాల్లో జి వి నరసింహారావు అంటే తెలియని వారు ఉండరు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టిడిపి బిజెపి పార్టీల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి గా జీవీఎల్ కి పేరు ఉంది. అప్పట్లో బాబోరు మీడియా కూడా జివిఎల్ నరసింహారావు ని టార్గెట్ చేస్తూ అనేక కథనాలు కూడా ప్రసారం చేసింది. అప్పట్లో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేత బాబోరు మీడియా ఛానల్ బండ బూతులు తిట్టడం జరిగింది. ఒక విషయాన్ని గురించి జరిగిన సమావేశంలో సీఎం రమేష్ భయంకరంగా జీవీఎల్ నరసింహారావు ని లైవ్ లో నే తిట్టారు. ఆ సంఘటన అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. అయితే ఆ తర్వాత జగన్ అధికారంలోకి రావటం తో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అధికారం లేకపోవడం తో పాటుగా కొనఊపిరితో ప్రతిపక్షంలో ఉండటంతో ఏపీ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారింది.

 

అయితే జీవీఎల్ నరసింహారావు ఎక్కువగా వైసిపి పార్టీ అధినేత జగన్ ని సపోర్ట్ చేస్తారన్న బలమైన వాదన బీజేపీ లోనూ అలాగే ఏపీ రాజకీయాల్లోనూ ఉంది. ఇటీవల విశాఖపట్టణంలో విమానాశ్రయం బయట చంద్రబాబుపై దాడి జరిగిన సంఘటన అందరికీ తెలిసినదే. ఆ తర్వాత రోజే జివిఎల్ నరసింహారావు విజయవాడ లో మీడియా సమావేశం పెట్టి విశాఖపట్టణంలో చంద్రబాబు మీద వైసీపీ దాడి చెయ్యటానికి చంద్రబాబే కారణం అంటూ, కొత్త లాజిక్ చెప్పారు. ఎంత జగన్ ను వెనకేసుకుని వస్తే మాత్రం, ఇలా ఎలా చెప్తారు అంటూ, సొంత పార్టీ నేతలే అనే పరిస్థితి. ఇది ఇలా ఉంటే, ఆ సాయంత్రమే జీవీఎల్ ఒక్కరే వెళ్లి గవర్నర్ ని కలిసారు.

 

అక్కడ ఏమి మాట్లాడారో, ఎవరి పై కంప్లైంట్ చేసారో తెలియదు కాని, ఈ పరిణామం బీజేపీ ఏపి శాఖకు కోపం తెప్పించింది. గవర్నర్ వద్దకు జీవీఎల్ ఒక్కరే వెళ్ళటం ఏమిటి, అనే అంశం పై, హైకమాండ్ కు ఫిర్యాదు చేసారు. ఈ ఒక్క విషయంలోనే కాదు చాలా విషయాలలో జీవీఎల్ నరసింహారావు వ్యవహరించే తీరు ఒకలా ఉంటే ఏపీ బిజెపి నాయకులు వ్యవహరించే తీరు మరోలా ఉండటం ఇప్పుడు బీజేపీ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఈ సందర్భంగా ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా...జీవీఎల్ నరసింహారావు కి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఏపీ రాష్ట్ర బీజేపీ నేతలతో మాట్లాడిన తర్వాత ఏదైనా ముందడుగు వేయాలని అది కూడా వాళ్ళతో కలిసి మాత్రమే వెయ్యాలని సూచించారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: