నిర్మలా సీతారామన్ ఉన్నత విద్యాభ్యాసం చేసి, మంచి స్థాయిలో ఉద్యోగం చేస్తూ అన్యూహాంగా రాజకీయలోకి వచ్చింది. భారత రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. తొలి మహిళా రక్షణ మంత్రిగా, అలాగే ఆర్థిక మంత్రిగా ఎన్నికై జాతీయ రాజకీయాల్లో ప్రత్యేకత సాధించారు నిర్మలా సీతారామన్. 

 

సీతారామన్ మొదట ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేశారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలోనూ పనిచేశారు. 2003-05 మధ్యకాలంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా సీతారామన్ సేవలు అందించారు. సీతారామన్ బీజేపీ వైపు ఆకర్షితురాలు కావడనికి ఇది దోహద పడింది అని చెప్పవచ్చు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉండగా ౩౩% మహిళా రిజర్వేషన్ కి బీజేపీ శ్రీకారం చుట్టడం ఆమె రాజకీయ రంగానికి కీలక మలుపుగా మారింది.

 

IHG

 

అదే సమయంలో బీజేపీ జాతీయ కార్యవర్గంలో చేరాల్సిందిగా ఆమెను పార్టీ ఆహ్వానించింది. 2010లో పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు. నాలుగేళ్లు గడిచేటప్పటికీ 2104లో shankar PRASAD' target='_blank' title='రవి శంకర్ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రవి శంకర్ ప్రసాద్ నేతృత్వంలోనే ఆరుగురు బీజేపీ అధికారుల ప్రతి నిధులు బృందంలోని ఒక్కరిగా స్థానం సంపాదించుకున్నారు. నిర్మలా సీతారామన్ బీజేపీలోకి చేరడం ఒక్క అన్యుహ పరిణామంగా చెప్పుకోవచ్చు.

 

IHG

 

2104లో మోదీ ప్రభుత్వం అధికారం చేప్పట్టిన తర్వాత ఆమెకు మోడీ క్యాబినెట్ లో చోటు దక్కింది. ఆ తర్వాత ఆమె ఏపీ నుండి రాజ్యసభకు ఎన్నికైయ్యారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చిన సీతారామన్ మూడేళ్లలో కీలకమైన రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. క్యాబినెట్ హోదా అందుకోవడంతో పాటు ఆ బాధ్యతలు చేపట్టిన మహిళా మంత్రిగా రికార్డు సృష్టించారు. రక్షణ శాఖలో అనతి కాలంలో తనదైన ముద్ర వేసుకున్నారు సీతారామన్. ఆమెకు అత్యంత ప్రాధ్యాన్యత కలిగిన ఆర్థిక శాఖను మోడీ కేటాయించారు.  భారతదేశ మొట్ట మొదటి పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా నిర్మల మరోసారి రికార్డు సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: