క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు. తండ్రి కేసీఆర్ ఆశ‌య సాధ‌న‌లో పాలుపంచుకున్న ఆడ‌బిడ్డ‌.. పూల పండుగ బ‌తుక‌మ్మ‌ను విశ్వ‌వ్యాప్తం చేసిన‌ తెలుగింటి ముద్దుబిడ్డ‌..! తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షురాలిగా అన‌తికాలంలోనే తిరుగులేని శ‌క్తిగా ఎదిగిన నేత‌. తెలుగుతోపాటు ఆంగ్లంలోనూ అద్భుత‌మైన వాగ్ధాటితో తండ్రికి త‌గ్గ త‌న‌య‌గా గుర్తింపును తెచ్చుకున్నారు. మ‌హిళా సాధికార‌త కోసం ఆమె చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు ఎంద‌రికో స్వ‌యం ఉపాధి మార్గాన్ని చూపుతున్నాయి. నేటి యువ‌త‌కు స్ఫూర్తిగా నిలుస్తున్న ఆమెపై అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌త్యేక క‌థ‌నం మీ కోసం..



తెలంగాణ ఉద్య‌మం ఉధృతంగా సాగుతోన్న స‌మ‌యంలో బతుక‌మ్మ ఉత్స‌వాల ద్వారా తెలంగాణ ప‌ల్లె స‌మాజంలోనూ, మ‌హిళా స‌మాజంలోనూ ఆమె ఉద్య‌మ స్ఫూర్తిని రగిలించారు. ప్ర‌తి ఒక్క‌రు తెలంగాణ కోసం బ‌య‌ట‌కు వ‌చ్చి పోరాటాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బ‌తుక‌మ్మ ఉత్స‌వాలు... తెలంగాణ స‌మాజంలో తెలంగాణ జాగృతి ఉద్య‌మ స్ఫూర్తి ర‌గిలించిన తీరు వెన‌క క‌విత పోరాట పంథాను ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంసించి తీరాల్సిందే. ఇక ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన వెంట‌నే కేసీఆర్ త‌న బిడ్డ క‌ష్టాన్ని గుర్తించి నిజామాబాద్ ఎంపీ సీటు ఇచ్చారు.



2014 ఎన్నిక‌ల్లో క‌విత నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచి ఐదేళ్ల పాటు ఢిల్లీలో అనేక తెలంగాణ స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేశారు. కేసీఆర్ కుమార్తెగా క‌న్నా త‌న‌కు తాను వ్య‌క్తిగ‌తంగా ఫ్రూవ్ చేసుకునేందుకే ఆమె ఎప్పుడూ పోరాటం చేసేవారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఉద్య‌మంలో పాల్గొని.. పోరాటాలు చేసి మ‌రీ పైకి వ‌చ్చారు. అయితే గ‌తేడాది లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆమె నిజామాబాద్‌లో కొన్ని కార‌ణాల వ‌ల్ల ఓడిపోయారు. అయితే అంత‌కుముందు జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న నిజామాబాద్ పార్ల‌మెంటు ప‌రిధిలో అంద‌రు ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను గెలిపించుకున్నారు.



ఇక క‌విత భ‌విష్య‌త్తులో మ‌రెంతో రాజ‌కీయ ప‌ర‌మైన పాత్ర తెలంగాణ కోసం పోషించాల్సి ఉన్న నేప‌థ్యంలో ఆమెను కేసీఆర్ రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: