చాలా కాలంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, అసెంబ్లీ సీట్ల సంఖ్య బాగా పెరుగుతాయని భావిస్తూ వస్తున్నారు అన్ని రాజకీయ పార్టీల నాయకులు. ఈ మేరకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఈ అంశానికి చోటు కూడా కల్పించారు. 2014 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాయని రాజకీయ నాయకులు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక తెలుగుదేశం, టిఆర్ఎస్ పార్టీలు నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాయని, తాము అధికారంలో ఉన్న సమయంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ తమ పార్టీలో చేర్చుకుని వారికి కూడా సీటు హామీ  ఇచ్చారు. 

 

అలా  2014 నుంచి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతాయని ఆశలు పెట్టుకుంటూ ఉండగా కేంద్రం ఎప్పటికప్పుడు ఆ ఆశలపై నీళ్లు జల్లుతూనే వస్తోంది. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో 175 సీట్లకుగాను, 225 వరకు పెరగాలి. అలాగే తెలంగాణలో 119 నుంచి 153 సీట్లకు పెంచాలని విభజన చట్టంలో పొందు పరిచారు. ఈ లెక్క ప్రకారం పార్లమెంటు నియోజకవర్గానికి రెండు అసెంబ్లీ సీట్లు పెరగాలి. ఈ సీట్ల సంఖ్య పెరిగితే కొత్త నాయకులు వస్తారు. దీంతో రాజకీయ పార్టీలు పెరిగే నియోజకవర్గాలపై ఆశలు పెట్టుకుంటూ ఉండగా, కేంద్రం మాత్రం ఆ ఫైలును ముందుకు కడపడంలేదు.

IHG


 తాజాగా జమ్మూ కాశ్మీర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ లోక్ సభ సీట్ల పునర్వ్యవస్థీకరణ కు కమిషన్ ను కేంద్రం నియమించింది. రిటైర్డ్ జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన లేదనే సంకేతాలు కేంద్ర ఇవ్వడంతో ఇక్కడ నాయకులు ఉసూరుమంటున్నారు. ఎప్పటికప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్రం మోసం చేస్తోందని, రాజకీయమైన భయంతోనే బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తూనే ఉందంటూ మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: