బుద్దులు చెప్పాల్సిన వృత్తి లో ఉన్న ఓ కాలేజ్ ప్రిన్సిపాల్ గాడి తప్పి విద్యార్థుల తో అసభ్యం గా ప్రవర్తించాడు. వికృత చేష్టలతో విద్యార్థి పై ప్రవర్తించాడు.  దాడులకు దిగాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా లో చొటు చేసుకుంది. నల్గొండ నల్గొండ జిల్లాలోని మహత్మగాంధీ యూనివర్సిటీ  వైస్ ప్రిన్సిపల్ లైంగిక లీలలు బయటపడ్డాయి. ఆయన స్థాయి మరచి ఇంజినీరింగ్‌ విద్యార్థినులకు ఫోన్‌లో అసభ్యకర మెసేజ్‌లు పెడుతుండడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

 

 

అయితే, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ కాలేజీ వైఎస్‌ ప్రిన్సిపల్‌ వై.పునీత్‌కుమార్‌ వేధింపులు భరించలేని విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.. అసభ్యకర మెసేజ్‌లు పెడుతూ వైస్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాధిత విద్యార్థినులు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. 

 


కానీ వారు ఏ మాత్రం పట్టించు కోవడం తో వారు స్థానిక పొలిసు స్టేషన్లో ప్రిన్సిపాల్ పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కంప్లంట్ నాట్ చేసుకున్న పోలీసులు.. అతనిపై ఫోక్స్ కేసు నమోదు చేసుకున్నారు. ఫోన్‌డేటా, అతను పంపిన మెసెజ్‌లను పరిశీలించడంతో ఆయనపై ఆరోపణలు రుజువయ్యాయి. విషయం అప్పటికే తెలుసుకున్న నిందితుడు పరారీ ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. రెండు రోజుల క్రితం వైస్ ప్రిన్సిపల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. చివరికి నిందితుడు నేరం ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

 

 

ఇంజినీరింగ్‌ వైఎస్‌ ప్రిన్సిపాల్‌ పునీత్‌ కుమార్‌ విద్యార్థినులను వేధిస్తున్న విషయమై యూనివర్శిటీలో ఓ కమిటీని నియమించినట్లు ఏస్పీ రంగానాథ్‌ తెలిపారు. కమిటీ సభ్యుల విచారణలో తనకు అనుకూలంగా చెప్పాలని పలువురు విద్యార్థులకు ఫోన్‌ చేయడంతో పాటు మెసెజ్‌లు పంపినట్లు కమిటీ వెల్లడించింది. దీంతో కమిటీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని యూనివర్శిటీ యాజమాన్యం చెప్పినట్లు వెల్లడించారు. ఇలాంటి వాళ్ళను బయటకు వదలొద్దని కొందరు ఆరోపిస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: