ఆమె పడిలేచే కిరటం. అలుపెరగని విజయాలకు కేర్ అఫ్ అడ్రెస్ గా నిలిచే అరుదైన వ్యక్తి ఆమె. ఆమె పని అయిపోయిదని విమర్శలు వెలువెత్తునప్పుడలా పసిడి కాంతులు విరజిమ్ముతూనే ఉంది. ఆమె భారత బాక్సింగ్ క్వీన్ మేరీకోమ్. మేరీకోమ్ భారత బాక్సింగ్ చరిత్రకే ఒక్క సువర్ణ అధ్యాయం. 

 

భారత ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో జన్మించింది. భారత బాక్సింగ్ కి మని హారంలా మారిన ధీర వనిత మేరీకోమ్. బాక్సింగ్ అంటే ప్రాణం పెట్టే మేరీకోమ్ ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంది. ఆడపిల్లకు బాక్సింగ్ ఏంటి అన్న తండ్రిని ఎదురించింది. కట్టుబాటులను కూల దోసింది. తన ఆంక్షలను నెరవేర్చుకునే క్రమంలో అడ్డుకున్న వ్యవస్థతో పోరాడింది. విజయాన్ని సాధించింది. పసిడి పతకాలతో మెరిసింది. ఒక్కటా, రెండా ఆరు స్వర్ణాలతో క్రీడా అధ్యాయం లికించింది ఆమె.

 

IHG

 

బాక్సింగ్ అంటే ప్రదకరమైన కష్ట సాధ్యమైన క్రీడ. కఠోర శ్రమ చేస్తే తప్ప దింట్లో రాణించటం కష్టం. అటువంటిది ఆమె కష్టాన్ని సైతం ఇష్టంగా మార్చుకున్న ఆమె పతకాల గెలుపులో తన పేరును లికించింది. రెండు సార్లు ఆమె సాధించిన పతాకల్లో ఒక్క అరుదైన విశేషం ఉంది. ఇద్దరి కవల పిల్లలకు సిజేరిన్ ఓపెరిషన్ ద్వారా జన్మనించిన 8 నెలలకే పతాకాన్ని సాధించింది. ఎంతో పట్టుదల కృషి ఉంటే తప్ప అది సాధ్యం కాదు.

 

IHG

 

మణిపురి బాక్సర్ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో రికార్డు స్థాయిలో ఆరోసారి బంగారు పతకం సాధించింది. దీంతో అత్యధిక సార్లు ఈ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన మహిళా బాక్సర్‌గా మేరీ చరిత్రకెక్కింది. దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌కు ఒక మహిళా అథ్లెట్‌ను ఎంపిక చేయడం ఇదే తొలిసారి. ఫలితంగా మేరీకోమ్‌ పద్మ విభూషణ్‌కు సిఫారుసు చేయబడ్డ తొలి క్రీడాకారిణిగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: