స్ధానిక సంస్ధల ఎన్నికలపై చంద్రబాబునాయుడు చేతులెత్తేసినట్లే అనిపిస్తోంది. మీడియాతో చంద్రబాబు మాట్లాడిన మాటలు చూస్తుంటే అనుమానాలు కాదు నిర్ధారణగానే అనిపిస్తోంది. ఎన్నికల్లో పాల్గొనే విషయంలో పార్టీ నేతలు ఒకతీరున మాట్లాడుతుంటే చంద్రబాబు మరీ బేలగా మాట్లాడుతుండటమే విచిత్రంగా ఉంది. 

 

ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇష్టానుసారంగా ప్రకటించారంటూ రెచ్చిపోయారు. అలాగే నోటిఫికేషన్, షెడ్యూల్ ఒకేసారి ఎలా ప్రకటిస్తారని అడగటమే విచిత్రంగా ఉంది. షెడ్యూల్, నోటిఫికేష్ ఒకేసారి ప్రకటించకూడదని ఎక్కడా లేదు. పైగా ఈ మధ్య సవరించిన పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం ఎన్నికల నిర్వహణ రోజులను బాగా తగ్గించారు. దాని ప్రకారం షెడ్యూల్, నోటిఫికేషన్ ఒకేసారి ఇవ్వచ్చు. ఈ విషయం కూడా తెలియకుండానే మీడియా సమావేశంలో చంద్రబాబు నోరు పారేసుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.

 

అలాగే ఎన్నికల నిర్వహణ గజిబిజిగా ఉందంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ప్రకారం చూసినా ఎన్నికల కమీషన్ ప్రకటన చూసినా ఎక్కడా ఎన్నికల్లో గిజిబిజి లేదు. ఉన్న గిజిబిజంతా చంద్రబాబు, టిడిపిలోనే. ఎన్నికల్లో అక్రమాలు అరికట్టేందుకు ప్రభుత్వం నిఘా యాప్ ను తీసుకొచ్చింది. దీన్ని కూడా చంద్రబాబు ప్రశ్నించేశారు. నిఘా పెట్టే అధికారం ఎన్నికల కమీషన్ కే కానీ ప్రభుత్వానికి ఎక్కడదంటూ ఓ పనికిమాలిన ప్రశ్న లేవనెత్తారు. ప్రభుత్వం అంటే ఇక్కడ పోలీసులే ప్రధానం. పోలీసుల పక్షాన ఎన్నికల పై నిఘా కోసం ఓ యాప్ తీసుకొస్తే దానికి  చంద్రబాబు ఎందుకు ఉలికిపడుతున్నారు ?

 

సరే అరిగిపోయిన పాత రికార్డయిపోయిన బిసిల రిజర్వేషన్ విషయాన్నే మళ్ళీ ప్రశ్నించారు. 34 నుండి 24 శాతానికి రిజర్వేషన్లు తగ్గిపోవటం వల్ల బిసిలకు అన్యాయం జరిగిపోయిందంటూ మొసలి ఏడుపులేడుస్తున్నారు. అసలు బిసిలకు రిజర్వేషన్ తగ్గిపోవటానికి కారణమే చంద్రబాబని జనాలందరికీ తెలుసు. అలాంటిది బిసిల ముందు జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలపాలని ప్రయత్నిస్తున్నారు. కళ్ళముందు జరుగుతున్న వ్యవహారాలను కూడా జనాలు తెలుసుకోలేరని చంద్రబాబు అనుకుంటున్నట్లున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: