స్త్రీ-పురుషులు సమానమని, రెండు అర్ధ భాగాలు కలిసిన ఒకే భాగమని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలాగే మన రాజ్యాంగమూ చెబుతోంది. సమాన అవకాశాలు కల్పిస్తామని పాలకులూ తరచూ ఓట్ల నేపథ్యంలో చెబుతూ వుంటారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనేది, వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF ) నివేదిక చెబుతోంది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం సమానత్వం కోసం మహిళలు ఇంకా వందేళ్లు నిరీక్షించే విస్తుపోయే నిజాన్ని వెల్లడించింది. 

 

IHG

 

అంటే కాకుండా, స్త్రీ-పురుష అసమానతలు గతంతో పోలిస్తే, ఇపుడు ఇంకా పడిపోతున్నాయని కూడా WEF ఆందోళన వ్యక్తం చేసింది. విశ్వ వ్యాప్తంగా అన్నిరంగాల్లో కూడా మహిళలకు సమానత్వం రావాలంటే ఇంకా  83 ఏళ్లు పడుతుందని 2019లో అంచనా వేశారు. కానీ ఇప్పుడా వ్యత్యాసం మరింత పెరిగినట్లు సమాచారం. మహిళల సమానత్వానికి కాస్త అటుఇటుగా ఇంకా నూరేళ్లు పడుతుందని డబ్యూఈఎఫ్ నివేదిక చెబుతోంది. 

 

అయితే, ఆరోగ్యం, విద్య విషయంలో మాత్రం మహిళలతో పోలిస్తే పురుషులే వెనకడుగులో వున్నారు. కానీ ఆర్థిక, రాజకీయ విషయాల్లో మహిళల భాగస్వామ్యం ఆశించినంతగా మెరుగు పడలేదని తన నివేదికలో డబ్యూఈఎఫ్ పేర్కొంది. ఇక ఉద్యోగాల్లో సమానత్వం రావాలంటే మహిళలు ఇంకా 217 ఏళ్లు ఎదురుచూడాలని చెప్పింది. ఇక స్త్రీ-పురుషుల జీతాల విషయం సంగతి మనకు తెలిసినదే.

 

IHG

 

అతి చిన్న దేశాలైనా.. ఫిన్లాండ్, ఐస్లాండ్ వంటి స్కాండినేవియా దేశాలు, స్త్రీ-పురుష సమానత్వంలో ముందుండటం గమనార్హం. ఇక ఈ విషయంలో భారతదేశం మాత్రం, 21 పాయింట్లు దిగజారి, 108 స్థానానికి పడి పోయింది. ఇక పొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్ కూడా భారత్ కంటే బెటర్ గా ఉన్నాయి. మహిళలకు తక్కువ వేతనాలు, ఆర్థిక వ్యవహారాల్లో వారి భాగస్వామ్యం లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా డబ్యూఈఎఫ్ అంచనా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: