ఎన్నికలు అనే పదం వింటేనే... తెలుగుదేశం పార్టీకి చలి జ్వరం వచ్చేస్తున్నట్టుగా ఆ పార్టీలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చెందడంతో అప్పటి నుంచి చంద్రబాబుకు ఎన్నికలంటేనే ఆందోళన ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నారు. వాస్తవంగా టిడిపి ప్రభుత్వం లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా... ప్రజా వ్యతిరేకత, ఓటమి భయంతో పాటు, ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికల్లో కూడా పడుతుందనే భయంతో స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీంతో టిడిపిలో ఆందోళన మొదలైంది. 

 

IHG


వాస్తవంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా స్థానిక సంస్థల ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు అదే బాబు లో కలవరం కలిగిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రావడంతో ఇప్పటికే పార్టీలో బలమైన నాయకులంతా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మళ్లీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవే చేదు ఫలితాలు ఎదురైతే, పార్టీలో ఉన్న కొద్ది మంది నాయకులు కూడా దూరం అవుతారనే బాధ, భయం చంద్రబాబులో కనిపిస్తుండడంతో ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ ఎన్నికలు జరగకుండా వాయిదా వేయించాలని చంద్రబాబు  శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. బిసి రిజర్వేషన్లు, కరోనా వైరస్, ఇలా అనేక సాకులు చెబుతూ కోర్టు మెట్లు ఎక్కారు.

 

IHG


 అయినా జగన్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలాఖరులోపు ఎన్నికల తంతు ముగించాలని చూస్తోంది. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ఎక్కడా అవినీతి, అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు, కొత్తగా మొబైల్ యాప్ ను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అధికార పార్టీ కాబట్టి అధికారులు, ప్రజలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారని చంద్రబాబు ముందే గ్రహించాడు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా ఏవో సాకులు చూపిస్తూ తన భయాన్ని పోగొట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: