తెలంగాణ బిజెపి పీఠంపై కూర్చునేందుకు చాలా కాలంగా, చాలామంది పోటీ పడుతున్నారు. పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో తమ హవా మరింత పెరుగుతుందని ఆలోచిస్తున్న తెలంగాణ బిజెపి నాయకులు అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ను తప్పించి చురుకైన, సమర్థవంతమైన నాయకుడికి బిజెపి పగ్గాలు అప్పగిస్తే వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేస్తారని బీజేపీ అధిష్టానం భావిస్తున్న తరుణంలో కొంతమంది వ్యక్తుల పేర్లను ఇప్పటికే పరిశీలన కోసం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్ గట్టిగానే పోటీపడుతుండగా, కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన కొంతమంది సీనియర్ నాయకులు కూడా తనకున్న పరిచయాలతో అధ్యక్ష పీఠం కోసం ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నారు. 

IHG


ఇప్పటికే రకరకాల పేర్లను పరిశీలించిన బీజేపీ అధిష్టానం, తాజాగా ఈ ఇద్దరి పేర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరిలో ఒకరికి అధ్యక్ష పీఠం దక్కడం ఖాయమని తెలంగాణ బిజెపి లో చర్చ నడుస్తోంది. ఆ ఇద్దరే డీకే అరుణ, జితేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపి లోకి వచ్చిన డీకే అరుణ, టిఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఈ ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేయాలని బీజేపీ అధిష్టానం చూస్తోంది. డీకే అరుణకు తెలంగాణ రాజకీయాల్లో బాగా పట్టు ఉండడంతో పాటు మంత్రిగా కూడా పని చేసిన అనుభవం ఉండడంతో, బలమైన వ్యక్తిత్వం, బలమైన కేడర్ తో కెసిఆర్ ను ఢీ కొట్టగల సామర్థ్యం ఆమెకు ఉందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. 

IHG


ఇదే సమయంలో జితేందర్ రెడ్డి కూడా తనకు ఉన్న ఢిల్లీ స్థాయి పరిచయాలతో బిజెపి అగ్ర నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయాలని బిజెపి అధిష్టానం ఇప్పటికే ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. తొందర్లోనే ఈ ఇద్దరిలో ఒకరు పేరును ఫైనల్ చేస్తూ ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: