నేడు ప్రతివారు ఎలా ఉన్నారంటే అంతా రెడిమెడ్ ఫుడ్‌కు అలవాటు అయ్యారు.. ఆకలేస్తే చాలు వండుకునే సమయం లేక ఆర్డర్ చేసి తెప్పించుకుని తింటున్నారు.. ఇక వీకెండ్ వస్తే చాలు షాపింగ్‌లని, వెళ్లుతారు బయట ఫుడ్డ్‌ను ఇష్టారీతిగా లాగించేస్తారు.. బిర్యానీలని, ఐస్‌క్రీం లని, ఇవే గాక ఇతర తినుబండారాలను వెనకాముందు చూసుకోకుండా లాగించేస్తారు.. ఇది ఎంత ప్రమాదమో ఎన్ని సార్లు చెప్పిన వినరు..

 

 

ఇక ఒకచోట ఓ డెలివరి బాయ్‌కి ఫుడ్ ఆర్డర్ చేస్తే అందులో సగం ఎంగిలి చేసి కస్టమర్‌కు డెలివరి చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే కాకుండా ఇలాంటి తిక్క తిక్క పనులు ఎన్నో చేస్తూ డెలివరి బాయ్‌లు కెమెరాలకు చిక్కిన సంఘటనలు కూడా ఉన్నాయి.. ఇలాంటి పనులు చేసి మనదేశంలో తప్పించుకుంటున్నారు గానీ విదేశాల్లో అయితే ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్ష అనుభవించవలసిందే.. అందుకు ఉదాహరణ ఇక్కడ ఒక యువకుడు చేతికి దురదపెట్టగా, ఆ దురదను నోటితో తీర్చుకున్నాడు.. ఆ తర్వాత ఎంత పెద్ద శిక్షను అనుభవించాడో తెలుసుకుంటే..

 

 

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో ఆడ్రీన్‌ ఆండర్సన్‌ అనే ఓ 24 ఏళ్ల యువకుడు, తన స్నేహితులతో కలిసి  వాల్‌మార్ట్‌ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లాడు.. వెళ్లిన వాడు అతని పని చేసుకుని తిన్నగా రావాలి కదా అలా రాలేదు.. ఆ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లగానే అక్కడున్న ఫ్రిజ్‌లో నోరూరించే ఐస్‌క్రీమ్‌ అతని కంటపడింది. వెంటనే వెనకా ముందు ఆలోచించకుండా, ఐస్‌క్రీమ్‌ను లాగించేశాడు. సగం తినేసి మిగిలింది ఏమీ తెలియనట్లు తిరిగి ఫ్రిజ్‌లో పెట్టాడు. అతని దగ్గర డబ్బులుంటే కొనుక్కోవాలి, లేదా తినాలనే కోరికను చంపుకోవాలి.. కానీ ఇలా గలీజ్ పని చేయడం దాన్ని అతని స్నేహితులు ఫోన్‌ తో వీడియో రికార్డు చేయడం జరిగింది...

 

 

అంతటితో ఆగకుండా దానిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అదికాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారడంలో పలువురు వైద్య అధికారులు ఈ ఘటన పై స్పందించి.. సంబంధిత సూపర్‌ మార్కెట్‌లో ఫిర్యాదు చేశారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు విచారించిన స్థానిక కోర్టు అతనికి 30 రోజుల జైలు శిక్షతో పాటుగా  రూ.75వేల రూపాయల జరిమానా కూడా  విధిస్తూ గురువారం తీర్పును వెలువరిచింది. అయితే ఇదంతా గత ఏడాది ఆగస్ట్‌లో జరిగింది... ఇదిగో ఇతను చేసిన తప్పు చిన్నదైనా, పెద్దదైనా సరే ఏమాత్రం కనికరం లేకుండా కటకటాల వెనక్కి పంపే చట్టాలు  అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నాయి.. ఇలా ఎక్కడైనా చట్టాలను అమలు చేస్తే న్యాయం తప్పక బ్రతుకుతుందనుకుంటున్నారు ఈ విషయం తెలిసిన వారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: