రాష్ట్రంలో టీడీపీ కాస్త ఎక్కువ బలంగా ఉన్న జిల్లాలో శ్రీకాకుళం కూడా ఒకటి. ఈ వెనుకబడిన జిల్లాలో టీడీపీకి బలమైన నాయకులు ఉన్నారు. మొన్న ఎన్నికల్లో ఇక్కడ రెండు సీట్లే సాధించినా, బలమైన నాయకత్వం ఉండటం వల్ల వైసీపీకి గట్టి పోటీగా నిలబడుతుంది. ముఖ్యంగా కింజరాపు ఫ్యామిలీ నుంచి అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులు ఉండటం టీడీపీకి కలిసొచ్చే అంశం. మొన్న ఎన్నికల్లో  అచ్చెన్న టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అటు శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ గెలిచారు.

 

దాదాపు వీరి ఫ్యామిలీకి జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో పట్టు ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని గెలిపించడానికి ఈ బాబాయ్-అబ్బాయ్‌లు తెగ  కష్టపడుతున్నారు. అటు రామ్మోహన్ ప్రతి నియోజకవర్గంలోని నాయకులని సమన్వయం చేసుకుంటూ, ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నారు. ఇటు అచ్చెన్న....ఇదే జిల్లాకు చెందిన రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుతో కలిపి గెలుపుపై వ్యూహాలు రచిస్తున్నారు. అలాగే ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, పలాసలో గౌతు ఫ్యామిలీ, శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో గుండా లక్ష్మీ, ఆముదాలవలసలో కూన రవికుమార్‌లు కింజరాపు ఫ్యామిలీతో కలిసి టీడీపీని గెలిపించేదుకు కష్టపడుతున్నారు.

 

అయితే ఈ బాబాయ్-అబ్బాయ్ పప్పులు జగన్ దగ్గర ఉడకవని సంగతి అర్ధమైపోతుంది. బీసీ సామాజికవర్గంలో స్ట్రాంగ్‌గా ఉన్న వీరికి, ఆ బీసీ కార్డుతోనే జగన్ చెక్ పెట్టనున్నారు. కీలకమైన జెడ్పీ ఛైర్మన్ బీసీ మహిళ కేటాయించడం వల్ల, వైసీపీకి కలిసి రానుంది. జిల్లాలో బీసీలు ఎక్కువ ఉండటం, వారు వైసీపీకే మద్ధతు తెలిపే అవకాశముంది. పైగా అదే జిల్లాలో బీసీ సామాజికవర్గానికి చెందిన ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా ఉండగా, అదే బీసీలకు చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్‌గా ఉన్నారు. పైగా మొన్న ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ 10 స్థానాల్లో 8 స్థానాలని గెలుచుకుంది. దీని బట్టి చూసుకుంటే జిల్లా జెడ్పీ పీఠం వైసీపీ ఖాతాలో పడనుంది. మొత్తానికైతే బాబాయ్-అబ్బాయ్‌లకు జగన్ అదిరిపోయే షాక్ ఇవ్వడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: