స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏపీ మంత్రులు పెద్ద అగ్నిపరీక్ష ఎదుర్కొనున్నారు. సీఎం జగన్ తమ తమ నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించుకోలేకపోతే పదవులు రాజీనామా చేసేయాల్సిందే అని వార్నింగ్ ఇవ్వడంతో, మంత్రులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా అమరావతి ప్రభావం ఎక్కువ ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు కాస్త ఎక్కువగానే టెన్షన్ పడుతున్నారు. అయితే ఈ జిల్లాల్లో కూడా కృష్ణాలో ఉన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు  ఎక్కువ ఇబ్బంది ఉందని తెలుస్తోంది.

 

ఎందుకంటే ఆయన విజయవాడ నగర ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో వెస్ట్ నుంచి విజయం సాధించి, మంత్రి కూడా అయ్యారు. ఇక స్థానిక పోరులో విజయవాడ కార్పొరేషన్‌లో వైసీపీని గెలిపించాల్సిన ప్రధాన బాధ్యత వెల్లంపల్లిదే. అయితే ఇక్కడ పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేవనే చెప్పాలి. రాజధాని అమరావతి ప్రభావం విజయవాడ నగరంపైన బాగా ఉంది. మూడు రాజధానులు నిర్ణయానికి నగర ప్రజలు వ్యతిరేకంగానే ఉన్నారు. అలాగే నగరంలో టీడీపీ బలంగా ఉంది.

 

మొన్న ఎన్నికల్లో నగర పరిధిలో ఉన్న తూర్పు నియోజకవర్గంలో టీడీపీ తరుపున గద్దె రామ్మోహన్ 15వేల పైనే మెజారిటీతో గెలిచారు. ఇక ఎంపీ కూడా టీడీపీనే కైవసం చేసుకుంది. కేశినేని నాని ఎంపీగా ఉన్నారు. అటు సెంట్రల్ నియోజకవర్గంలో బొండా ఉమా కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన నియోజకవర్గంలో పని చేసుకుంటూనే ఉన్నారు. ఇటీవల ప్రజా చైతన్య యాత్ర పేరుతో నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతున్నారు.

 

ఇక వెస్ట్‌లో ఉన్న మంత్రి వెల్లంపల్లి 7 వేల మెజారిటీతో గెలిచారు. అయితే ఈ మెజారిటీలు పరంగా లెక్క వేసుకుంటే మెజారిటీ డివిజన్లు టీడీపీ గెలుచుకుని, కార్పొరేషన్‌ని సొంతం చేసుకోగలదు. పైగా అమరావతి ఇష్యూ కూడా కలిసిరానుంది. కాకపోతే అధికారంలో ఉండటం మంత్రికి ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్. ఆ అధికారంతో కార్పొరేషన్ సొంతం చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి చూడాలి విజయవాడ కార్పొరేషన్ వైసీపీ ఖాతాలో పడేసి వెల్లంపల్లి సక్సెస్ అవుతారో? లేక వెల్లంపల్లికే టీడీపీ షాక్ ఇస్తుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: