మానవ జీవితంలో అత్యంత కీలకమైన శృంగార జీవితంపై ఇప్పటికే కొన్ని లక్షల అధ్యయనాలు... పరిశోధనలు జరిగాయి. శృంగారాన్ని ఎలా ? ఎంజాయ్ చేయాలో అనేక దేశాల్లో అనేకమంది సెక్సాలజిస్టులు రకరకాల పరిశోధనలు చేశారు. దాంపత్య జీవితంలో శృంగారం అనేది ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజు వ్యాయామం చేసే వారిలో లైంగిక వాంఛలు ఎంత మాత్రం తగ్గవని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే బరువు అదుపులో ఉంటుంది. ఈ క్రమంలోనే శృంగారాన్ని బాగా ఆస్వాదించవచ్చు అని చెబుతున్నారు. ఇక కొందరు దంపతులకు పెళ్ళికి ముందు శృంగారం ప‌ట్ల‌ అంత ఆసక్తి ఉండదు. అయితే దీనిని నివృత్తి చేసుకో పోతే చాలా మంది దంపతుల మధ్య తర్వాత కూడా గ్యాప్ పెరుగుతుంది.. ఇది నిజం.

 

శృంగారం అనేది ఇద్దరిలో ఇద్దరిలో ఆనందానికి సంబంధించింది అన్న విషయం గుర్తుంచుకోవాలి శృంగారంలో కేవలం ఒక్కరు మాత్రమే తృప్తి పొందితే అది సంతృప్తి పొందినట్టు కాదు. చాలామంది జంటల మధ్య మారిన మానవ సమాజం నేపథ్యంలో ఆందోళన పని ఒత్తిడి వల్ల శృంగారాన్ని సరిగా ఆస్వాదించలేక పోతున్నారట. దీని నుంచి బయట పడేందుకు ప్రతిరోజు ధ్యానం చేయడం... ఒత్తిడి తగ్గించుకోవడం... వ్యాయామం చేయటం సరైన పద్ధతులని సెక్సాలజిస్టులు చెపుతున్నారు.

 

ఇక భార్యాభర్తలు పెళ్ల‌యిన కొత్తలో శృంగారం బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే కాలం గడిచే కొద్దీ ఇద్దరి మధ్య బాధ్యతలు పెరిగి శృంగారం విష‌యంలో దూరం పెరుగుతూ ఉంటుంది. అయితే దీనిని ఎప్పటికప్పుడు త‌గ్గించేలా చేసుకోవాలి. ప్రతి రోజు నిద్ర సరిగ్గా లేకపోవడం కూడా లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు.. మాంసకృత్తులు ఎక్కువగా తీసుకుని.. చక్కెర, నూనె పదార్థాలు తగ్గించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శృంగార జీవితం పై ఎప్పటికీ ఆసక్తి తగ్గకుండా చూసుకోవచ్చని సెక్సాలజిస్టులు చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: