తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు,  కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మ‌ధ్య ఘాటుగా వాదోప‌వాదాలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. దీనిపై సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క స్పందించారు. ``అసెంబ్లీలో చర్చ సందర్భంగా సభను కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తప్పుదోవ పట్టించారని సీఎం పదే పదే వ్యాఖ్యలు చేశారు. మిషన్ భగీరధ పనులు మునుగోడు నియోజకవర్గంలో పూర్తి కాలేదు, ఇంటింటికి మంచి నిల్లు అందడం లేదని రాజగోపాల్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కొత్త పథకం కింద అందరికి నిల్లు ఇవ్వలేకపోతున్నామని మిషన్ భగీరథ‌ అధికారులే తన సమీక్షలో అంగీకరించారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఇదే విషయంపై అధికారులను నిలదీసిన విషయాన్ని గుర్తు చేశారు. పాత పైపుల ద్వారానే చాలా గ్రామాలను నీటిని సరఫరా చేస్తున్నారని సభలో ప్రసంగించారు. కొత్త పైపులు వేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీయడాన్ని తట్టుకోలేకపోయిన సీఎం కేసీఆర్...రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సభలో ప్రసంగించారు`` అని మండిప‌డ్డారు.

 

మిషన్ భగీరధ పనులు పూర్తయ్యాయని...వందకు వంద శాతం ఇండ్లకు నల్లా ద్వారా మంచి నీటిని అందిస్తున్నామని చెప్ప‌డంలో వాస్త‌వం లేద‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. ``ప్రతి ఇంటికి మిషన్ భగీరధ నీల్లు అందుతున్నాయని ....దాన్ని ద్రువీకరిస్తూ స్వయంగా రాజ్ గోపాల్ రెడ్డి సంతకం కూడా చేసిన పత్రాలు తమ వద్ద ఉన్నాయన్నారు. నియోజకవర్గంలోని 334 గ్రామాల్లో అందరికి మిషన్ భగీరధ నిల్లు అందుతున్నట్లు సర్పంచ్‌లు తీర్మాణం చేసారని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి సంతకం చేసిన కాగితాలను సభలో చూయించి స్పీకర్‌కు కాగితాలను అందచేశారు. తన నియోజకవర్గ ప్రజలందరికి మంచి నీల్లు అందుతున్నట్టు సంతకం చేసి..సభలో మాత్రం 30 శాతం మందికి నిల్లు అందడం లేదని సభను తప్పుదోవ పట్టిస్తున్నారని...అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. అయితే నిజంగా రాజగోపాల్ రెడ్డి 100 శాతం నీల్లు వస్తున్నట్టు ద్రువీకరిస్తూ సంతకం చేసారా అంటే అది లేదు. మిషన్ భగీరథ లోపాలను ఎత్తి చూపుతూ..ఎక్కడెక్కడ సమస్యలున్నాయో వివరిస్తూ 5 ప్రతిపాదనలు సూచిస్తూ సంతకం చేసారు.`` అని విక్ర‌మార్క పేర్కొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: