ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వక సంబంధం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇద్దరూ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కలిసి ముందుకు నడుస్తున్నారూ  కూడా. అయితే తెలుగు రాష్ట్రంలోని ఏ ఒక్క రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకుంటే అది పరస్పరం ఇరు రాష్ట్రాల పై ప్రభావం చూపుతుంది అన్నది  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కూడా తెలంగాణ ప్రభుత్వం పై కాస్త ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాన్ని... తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

 

 ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా చెప్పక పోయినప్పటికీ పరోక్షంగా  వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ను తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గది  అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా తాము కూడా రాబోయే కాలంలో ఇంగ్లీష్ మీడియం పై దృష్టి సారిస్తామని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇంగ్లీషు ఎంతైనా  అవసరం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు

 

 

 అయితే బడ్జెట్ సమావేశాల అనంతరం... దీనిపై చర్చించి ఓ నిర్ణయానికి వస్తాము అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రజల నుంచి జగన్ తీసుకున్న నిర్ణయం పై మంచి స్పందన రావడంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు... మొగ్గు చూపుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పకనే చెప్పారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: