యెస్ బ్యాంక్ దివాళ అంచున ఉన్న నేప‌థ్యంలో ఖాతాదారుల్లో క‌ల‌వ‌రం జ‌రుగుతోంది. యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ ఇంటిలో  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సోదాలు నిర్వహించింది. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, బ్యాంక్‌లో జరుగుతున్న పరిణామాల గురించి నాకేమీ తెలియదని ప్ర‌క‌టించారు. గత ఏడాదికి పైగా బ్యాంక్‌ కార్యాకలాపాలకు దూరంగా ఉంటుండటంతో బ్యాంకులో జరుగుతున్న విషయాలు తెలిసే అవకాశాలు లేవని అన్నారు. మ‌రోవైపు, యెస్ బ్యాంక్‌‌లో అకౌంట్ ఉన్న కస్టమర్లు, ఆర్‌‌‌‌బీఐ తీసుకున్న చర్యలతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడేం ఏం చేయాలా? అని తలలు పట్టుకుంటున్నారు. 

 

యెస్ బ్యాంక్‌‌లో ఉన్న అన్ని అకౌంట్ల ఒక్కో డిపాజిటర్‌‌‌‌కు రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుందనే విషయం తెలిసిందే. ఇది పెద్ద ఉప‌శ‌మ‌నం. ఇక‌ యెస్ బ్యాంక్ నుంచి రూ.50 వేల కంటే ఎక్కువ విత్‌‌ డ్రా చేసుకోవడానికి వీలు లేదని ఆర్‌‌‌‌బీఐ చెప్పడంతో శాలరీ అకౌంట్ కస్టమర్లు   తమ మనీ క్రెడిట్ అయ్యేందుకు వేరే మార్గాలను చూసుకోవాలి. ఇన్వెస్టర్ల మనీని కాపాడేందుకు చాలా మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా యెస్ బ్యాంక్‌‌ అకౌంట్లలోకి వారి స్కీమ్‌‌ల రిడప్షన్ రిక్వెస్ట్‌‌లను అనుమతించడం లేదు. మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌కు యెస్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటే, కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌‌మెంట్ సొల్యుషన్స్ ఆఫీస్(క్యామ్స్) వద్ద మీ అకౌంట్‌‌ను మార్చుకునే రిక్వెస్ట్‌‌ను పెట్టుకోవాలి. సేవింగ్స్, డిపాజిట్స్, కరెంట్ అకౌంట్లు అన్నింటికీ విత్ డ్రా ఏ లోన్‌‌ను రెన్యూ చేసుకోవడానికి వీలు లేదని కూడా ఆర్‌‌‌‌బీఐ చెప్పింది కాబ‌ట్టి త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. 

 

కాగా, యెస్ బ్యాంక్‌ బోర్డును కూడా రద్దు చేసి, కొత్త అడ్మినిస్ట్రేటర్‌‌‌‌గా ఎస్‌‌బీఐ మాజీ సీఎఫ్‌‌ఓ ప్రశాంత్ కుమార్‌‌‌‌ను నియమించింది. యెస్‌ బ్యాంకు సంక్షోభాన్ని 30 రోజుల్లోగా పరిష్కరిస్తామని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ హామీ ఇచ్చారు. దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో స్థిరత్వాన్ని సాధించేందుకే యెస్‌ బ్యాంకుపై మారటోరియం విధించామని చెప్పారు. బ్యాంకింగ్‌ రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు ఇదే సరైన తరుణమని, యెస్‌ బ్యాంకును పునరుద్ధరించేందుకు త్వరలోనే కొత్త పథకంతో ముందుకు వస్తామని ఆయన తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: