తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రతరం అవుతోంది. మొదటి నుంచి హిందూపురం వైసీపీలో నాయకుల మధ్యకోల్డ్ వార్  జరుగుతూనే ఉంది. ఈ వ్యవహారాలు కారణంగానే హిందూపురంలో ప్రజా వ్యతిరేకత ఉన్నా.. మరో సారి నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు. అయినా అక్కడి వైసీపీ నాయకుల మధ్య సమన్వయం మాత్రం రావడం లేదు. ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్, నవీన్ నిశ్చల్ రెండు వర్గాలుగా విడిపోవడంతో, ఆ నియోజకవర్గంలో పార్టీ నిలువునా చీలిపోయింది. 

IHG


స్థానిక నేతలు అసలైన నేతలు తామే అంటూ నవీన్ నిశ్చల్ వర్గం బ్యానర్లు కట్టి మరి సమావేశం ఏర్పాటు చేయగా, దానికి పోటీగా ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వర్గం ప్రదర్శనకు దిగడంతో వైసీపీలో విభేదాలు రోడ్డున పడ్డాయి. స్థానిక నాయకులు హనుమంత్ రెడ్డి, నవీన్ నిశ్చల్ గత ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ కు అమ్ముడుపోయారని ఎమ్మెల్సీ అహ్మద్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ అవినీతి, అక్రమాలు నిరూపిస్తే ఉరేసుకుంటా అంటూ నవీన్ నిశ్చల్ వర్గం కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం కాస్త మరింత ముదిరింది. ఇంతకీ వీరి మధ్య ఈ స్థాయిలో విభేదాలు రావడానికి కారణం ఏంటి అంటే, కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ అహ్మద్ వద్దకు పనుల కోసం కొటిపి హనుమంత్ రెడ్డి వెళ్లారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి పట్టాల పంపిణీ కోసం, ప్రభుత్వం తీసుకున్న భూముల చదును పనులను హనుమంత్ రెడ్డిని కాదని వేరే వారికి ఇవ్వడంపై రచ్చ మొదలైంది. 

IHG


పార్టీలో ఉన్న వారిని కాదని, కొత్తగా పార్టీలో వచ్చిన వారికి పనులు ఎలా ఇస్తారంటూ హనుమంత్ రెడ్డి నిలదీయడంతో ఈ వ్యవహారం కాస్తా  ముదిరింది. ఈ విషయమై అడిగితే, ఎమ్మెల్సీ తనపై దాడికి పాల్పడ్డారని పోలీసులకు హనుమంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హనుమంత్ రెడ్డి కి నవీన్ నిశ్చల్ వర్గం మద్దతు పలికి ఆందోళన చేపట్టింది. దీంతో ఈ వ్యవహారం కాస్త రచ్చ రచ్చ అయింది. ఇక అక్కడి నుంచి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తూ, లోకల్ నాన్ లోకల్ అనే వెర్షన్ ను తెరమీదకు తీసుకురావడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది.

 

ఈ విషయంలో వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకుని ఈ రెండు వర్గాలకు గట్టిగా క్లాస్ పీకి ఈ వ్యవహారానికి అడ్డుకట్ట వేయకపోతే పార్టీ పరువు బజారున  పడుతుందని వైసిపి నాయకులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ విషయంలో జగన్ ఏ విధంగా స్పందించి ఇద్దరి మధ్య రాజీ కుదర్చుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: