మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా నియమితురాలైన సంచయిత గజపతి అన్యమతస్థురాలా ?, అన్యమతస్థురాలిని, హిందూ దేవాలయానికి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం  చైర్మన్ గా నియమించిందా?? అంటే అవుననే  కేంద్ర మాజీమంత్రి అశోక  గజపతి రాజు అంటుండగా , ఆయన వ్యాఖ్యలను బలపరిచే విధంగా ఒక తెలుగు  సినీ నిర్మాత ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది . గతం లో సంచయిత సోషల్ మీడియా లో ఏసు క్రీస్తు బొమ్మను  షేర్ చేసిన విషయాన్నిగుర్తు చేస్తూ ,  ఈ సందర్బంగా  మధుర శ్రీధర్ తన ట్వీట్ లో ఆ ఫోటోను  పోస్టు చేశాడు .

 

ఆంధ్ర ప్రదేశ్ దేవాలయాల్లో ఏమి జరుగుతుందో అర్ధం కావడం లేదని , ఎవరికీ చెప్పుకోవాలంటూ sridhar REDDY' target='_blank' title='మధుర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మధుర శ్రీధర్ ప్రశ్నించారు . తన ట్వీట్ ను  ప్రధాని మోదీ, జనసేనాని పవన్ కళ్యాణ్ లకు ట్యాగ్ చేయడం ద్వారా ఈ అంశం పై వారు స్పందించాలని కోరుకుంటున్నట్లుగా స్పష్టం అవుతోంది  .  సంచయిత తల్లి ఉమ  రెండవ భర్త అయిన వ్యక్తి క్రిస్టియన్ కావడం వల్లే , ఆమె కూడా క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తుందేమోనన్న అనుమానాలు  వ్యక్తం అవుతున్నాయి  . అయితే సంచయిత మాత్రం తాను హిందువునని , చర్చి కో  , మసీద్ కో  వెళ్లినంత మాత్రాన మతం మారుతుందా ? అంటూ ప్రశ్నిస్తోంది . అంతటితో ఆగకుండా తన కుటుంబీకులే ఈ రకమైన ఆరోపణలు చేయడం బాధిస్తోందని పరోక్షంగా అశోక గజపతి రాజు కు కౌంటర్ ఇచ్చింది .

 

 ఇక సంచయిత ...  ప్రస్తుతం బీజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు . ఆమెను వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం,  సింహాచల దేవస్థానం చైర్మన్ గా నియమించిన నేపధ్యం లో బీజేపీ నాయకత్వం సంచయిత ను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది .

మరింత సమాచారం తెలుసుకోండి: