స్థానిక సంస్థల ఎన్నికల హడావుడితో ఏపీలో అన్ని పార్టీలు హడావుడి చేస్తున్నాయి. వైసిపి, టిడిపి, జనసేన ఇలా మూడు ప్రధాన పార్టీలు టెన్షన్లు పడుతున్నాయి. క్షేత్ర స్థాయిలో తమకు బలం లేదని తెలిసినా, బిజెపి కూడా జనసేన తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉందా అనే అనుమానాలను ఇప్పటి వరకు అందరిలోనూ ఉంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం పై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆగ్రహం గానే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ ఎన్నికలను వాయిదా వేయించాలని ఆ పార్టీ చూస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్లు వేయించింది.

 

IHG


అకస్మాత్తుగా కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసలు ఇంత ఆకస్మాత్తుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏముంది అంటూ ఆయన ప్రశ్నించారు. అలాగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తోంది అంటూ మరో బాంబు పేల్చారు. అంతే కాదు తమకు అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉన్నారంటూ ఆయన ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సీఎం జగన్ మంత్రులకు, ఎస్పీలకు 90 శాతం గెలిపించే బాధ్యతను అప్పజెప్పారు అంటే ఏమి అర్థం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. డబ్బు, మద్యం పైన వైసీపీ ప్రభుత్వం మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందంటూ శైలజానాథ్ కామెంట్స్ చేశారు.

 

IHG


 అధికార పార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో  తప్పు చేస్తే  జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు ? అందరిలాగే వారి పైన చర్యలు తీసుకుంటాడో లేదో చూడాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ   ఏపీలో కనుమరుగైపోతున్న తరుణంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తుంది అంటూశైలజానాథ్ ప్రకటించడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమి భయంతో ఆందోళన చెందుతుంటే , ఏ ధైయిర్యంతో కాంగ్రెస్ ఈ విధంగా ప్రకటనలు చేస్తోంది అంటూ పలువురు ఎద్దేవా చేస్తున్నారు. మరోసారి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగితే చేతులు కాల్చుకోవాలసి వస్తుందంటూ మరికొందరు ఆ పార్టీ ఈ వ్యవహారంపై సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: