ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో అధికార వైసీపీ ఈ వారం ఎక్కువగా కసరత్తులు చేస్తుంది. సంక్షేమ కార్యక్రమాలను ఈ 9 నెలల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో ప్రవేశ పెట్టారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ లను ప్రజల్లోకి పంపించారు. అదే విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన లబ్ది దారుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది అనే చెప్పాలి. పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తున్నారు. వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తుంది అధికార పార్టీ.

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా అయినా సరే విజయం సాధించాలి అని పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులకు ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు అప్పగించారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించాలని అవసరమైతే ఎకగ్రీవాలు ఎక్కువగా చెయ్యాలని సూచించారు జగన్. దీనితో ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక పార్టీ కార్యకర్తలకు కూడా ఈ వారం దిశా నిర్దేశం చేసింది అధికార పార్టీ. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేసారు ఈ వారం. 

 

రాజకీయంగా పార్టీ బలంగా ఉన్న నేపధ్యంలో ఎక్కడా విపక్షానికి అవకాశ౦ ఇవ్వొద్దని భావిస్తుంది పార్టీ. దీనితో జగన్ ఆదేశాలను మంత్రులు అందరూ పాటిస్తున్నారు. ఇక ప్రజల్లోకి మూడు రాజధానుల అంశాన్ని తీసుకువెళ్ళే ప్రయత్నాలు అధికార ప్రతి నేతలు బలంగా చేస్తూ వస్తున్నారు. రాజకీయంగా దీని మీద విమర్శలు రావడంతో ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించి ప్రజా మద్దతు పొందాలని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు చేస్తుంది వైసీపీ. ఇక పార్టీ కార్యకర్తలకు స్థానిక సంస్థలకు సంబంధించి పలు  మార్గ దర్శకాలను కూడా అధికార పార్టీ చేసింది అనే తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం ఆ పార్టీకి తిరుగు ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: