వైద్యం, విద్య.. ఇప్పుడు సామాన్యుడు తన ఆదాయం నుంచి ఎక్కువగా ఖర్చు చేసే అంశాలు ఇవే.. అయితే ఈ ఖర్చు అవసరమైన చోట పెడితే బాగానే ఉంటుంది. కానీ పావలా మందు బిళ్లను పది రూపాయలకు అమ్ముతూ మందుల కంపెనీలు దోచుకుంటున్నాయి. ఈ దోపిడీని అరికట్టేందుకు ప్రవేశ పెట్టినవే జనరిక్ మందుల షాపులు..

 

 

ఐడియా బాగానే వర్కవుట్ అయిందనే చెప్పాలి. కేంద్రం దీన్ని జన ఔషధి పథకం పేరుతో విస్తరించింది. ప్రభుత్వమే మందుల షాపులు నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా భారీగా లబ్ధి పొందింది ఈ దేశ పేదలు మాత్రమేనంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ దుకాణాల ద్వారా దేశం మొత్తమ్మీద నెలనెలా కోటి మందికి ఔషధాలు చౌకగా అందుతున్నాయని ఆయన చెబుతున్నారు.

 

 

దేశవ్యాప్తంగా ఉన్న జన ఔషధి దుకాణ దారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సులో ప్రసంగించారు. ఆరు వేల జన ఔషధి కేంద్రాల ద్వారా పేదల సొమ్ము రూ.2000 నుంచి 2500 కోట్లు ఆదా చేయగలిగామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ కేంద్రాల్లో మందులు గరిష్ట అమ్మకం రేటు కంటే 50 నుంచి 90 శాతం తక్కువ ధరకు లభిస్తాయని ప్రధాని వివరించారు.

 

 

నిజంగా ఇది పేదలకు చాలా ఉపయోగపడే పథకమే అని చెప్పాలి. ఎందుకంటే.. కేన్సర్‌ వ్యాధి చికిత్సకు వినియోగించే మందులు మార్కెట్‌లో రూ.6500 వరకూ ఉంటే జన ఔషధి కేంద్రాల్లో కేవలం రూ.850 మాత్రమే ఉంటాయి. అంటే ప్రైవేటు కంపెనీలు ఎంత దోచుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ జన ఔషధి కేంద్రాల నిర్వాహకుల శ్రమను గుర్తించేందుకు అవార్డులు కూడా ఇస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: