ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అంతేకాదు కులాంతర మతాంతర వివాహాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పడం ఇంట్లో పెద్దలు అంగీకరించకపోతే పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకోవడం లాంటిది కూడా చాలానే జరుగుతున్నాయి. ఇలా కులాంతర వివాహాలు చేసుకొని పెద్దలను ఎదిరించి వారికి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా కొంత కాలం భద్రంగా నివసించేందుకు సేఫ్ హోమ్స్  నిర్మించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాలో ఈ సేఫ్ హోమ్స్  ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఏంటి ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే వారికి ఇంత  మంచి ఆఫర.. అని మురిసిపోతున్నారా.. ఇది మన రాష్ట్రంలో కాదు లెండి కేరళ రాష్ట్రంలో. 

 

 

 కేరళ రాష్ట్రంలో కులాంతర మతాంతర పెళ్లిళ్లు చేసుకున్న వారికి... సామాజిక న్యాయ శాఖ ఆధ్వర్యంలో సేఫ్ హోమ్స్  నిర్మించనున్నామని... కేరళ సామాజిక శాఖ మంత్రి కే శైలజ తెలిపారు. ఇప్పటికే అలా వివాహం చేసుకున్న వారికి కొన్ని రకాల ఆర్థిక సాయం అందిస్తామంటూ తెలిపిన ఆమె... ఏడాదిలోపు లక్ష రూపాయల ఆదాయం ఉన్న జంటలకు స్వయం ఉపాధి కింద 30 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఎస్సీ వర్గానికి 75000 అందిస్తున్నామని... ఆమె వెల్లడించారు. ఇలా ప్రభుత్వం కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వారికి కేటాయించిన సేఫ్ హోమ్స్ లో ఏకంగా ఏడాదిపాటు ఉండవచ్చు అంటూ మంత్రి శైలజానాథ్ తెలిపారు. 

 

 

 ఇలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే వారిని కుటుంబాల దూరం పెట్టడంతో పాటు దాడులకు దిగుతున్నారని అందుకే వారికి రక్షణ కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఇది మంచి నిర్ణయం అంటూ ప్రశంసిస్తుంటే.. ఇంకొంతమంది ఇది లవ్ జిహాద్ కోసమే కేరళ సర్కార్ నిర్ణయం తీసుకుందని బీజేపీ అనుబంధ సంఘాలు కూడా విమర్శిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది యువకులు హిందూ యువతులకు ఎరవేసి మత మార్పిడి కూడా చేశారు అంటూ విమర్శలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: