ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి . ఇక మరో సారి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా సర్వ ప్రయత్నాలు చేస్తున్న చంద్ర బాబు కొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రకటించిన రిజర్వేషన్లలో బీసీలకు రిజర్వేషన్లు వచ్చిన విషయం తెలిసిందే... అయితే రిజర్వేషన్ల విషయంలో అసంతృప్తిగా ఉన్న బీసీలను తమవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా  వ్యూహాలను రచిస్తున్నారు ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మామూలుగానే టిడిపి పార్టీకి బిసీ వర్గం నుంచి భారీ మొత్తంలో మద్దతుదారులు ఉంటారు అన్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకు తోనే అధికారంలోకి వచ్చింది టిడిపి పార్టీ. 

 

 

 కానీ 2019 ఎన్నికల విషయానికి వచ్చేసరికి కాపులకు రిజర్వేషన్లు ప్రకటించి.. బీసీ ఓటు బ్యాంకును దూరం చేసుకుంది. దీంతో బీసీ  ఓటు బ్యాంకు మొత్తం  వైసీపీ వైపు చూసింది. దీంతో ఒక్కసారిగా టిడిపి పార్టీని నేలకేసి కొట్టినంత పని అయిపోయింది. ఇక ఈ ఎనిమిది నెలల కాలంలో బీసీలకు దగ్గర అయ్యేందుకు  టిడిపికి ఎక్కడ అవకాశం దొరకలేదు. కానీ ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే... బీసీ వర్గాలు కాస్త కన్నెర్ర చేసినట్లు తెలుస్తోంది. జనాభా ప్రకారం రాష్ట్రంలో బీసీలు  ఎక్కువ ఉన్నప్పటికీ... హైకోర్టు నిర్ణయం ప్రకారం బీసీలకు 10శాతం రిజర్వేషన్లు కోల్పోతున్నారు... ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై కాస్త అసంతృప్తిగా ఉన్న బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

 

 

 ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని కారణంతో టిడిపి తరఫున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బిసి ఓటు బ్యాంకు టిడిపి పార్టీ వైపు మళ్ళుతుంది అని చంద్రబాబు భావిస్తున్నారట. దీనికోసం ఒక ఉద్యమాన్ని చేపట్టి మరి ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. తమ పార్టీ బీసీలకు అనుకూలంగానే సీట్లు ఇచ్చిందని కానీ అధికార పార్టీ  మాత్రం బీసీలను పట్టించుకోలేదు అనే అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చి  ప్రచారం చేయాలని టీడీపీ అధినేత  కూడా భావిస్తున్నట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో  ప్రచారం జరుగుతోంది. మరి చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: