మొన్నటి వరకు ప్రపంచంలో చైనాకే అనుకున్న కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ విస్తరించింది. దాంతో ఆయా దేశాలు అప్రమత్తమవుతున్నాయి.  కాకపోతే ఈ వైరస్ కి యాంటీ డోస్ కనుగొనలేక పోవడంతో జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత ఉందని సూచిస్తున్నారు. అయితే కొంత మంది కరోనా వైరస్ పై తమ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.  అయితే ఈ విషయంపై పోలీసులు చట్టపరమైన హెచ్చరికలు చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ లో కరోనా పెద్దగా లేకున్నా కొంత మంది పనికట్టుకొని దుష్పప్రచారాలు చేస్తున్నారు.  తాజాగా ఈ విషయంపై నిన్న తెలంగాణ అసెంబ్లీలో సీఎం సైతం కరోనా లేదని.. వచ్చినా భయపడేది లేదని అన్నారు. 

 

తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.   జిల్లా వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ ఉండేలా చూడాలన్నారు.  జిల్లాల డీఎంహెచ్ వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ కు గ్రానైట్ వ్యాపారం కోసం వచ్చిన చైనా , ఉజ్బెకిస్తాన్ వారిని గుర్తించి క్వారంటైన్ లో ఉంచినట్లు కరీంనగర్ జిల్లా వైద్య అధికారి తెలిపారు.   

 

ప్రజలకు ప్రభుత్వంపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకొని గెలిపించారు.. వారి బాధ్యతలు చూడాల్సిన అవసరం నాయలకు ఉందని అన్నారు.  జిల్లాల్లో జిల్లా వైద్య అధికారులు భాద్యత వహించాలన్నారు. సిబ్బంది, డాక్టర్స్ సమయపాలన , విధులు సరిగా నిర్వహించక పోయినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.  అంతే కాదు ఇప్పుడు విద్యార్థులకు పరీక్షల సమయం  ప్రతి గ్రామంలో ఉన్న స్కూల్ లో ఆశా వర్కర్స్, వైద్య సిబ్బంది కోవిడ్-19 అవగాహన కార్యక్రమం నిర్వహించాలని మంత్రి సూచించారు.  తెలంగాణ లో కరోనా బాధితులు తక్కువ ఉన్నారు.. జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి రోగాలు దరి చేరవని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: