ఈ మధ్యకాలంలో మహిళామణులు అందరూ సినిమాలు చూడడం కంటే సీరియల్ చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్న విషయం తెలిసిందే. సినిమాల్లో అయితే ఎంత ఎమోషన్ ఉన్నా ఎంత కామెడీ ఉన్నా రెండున్నర గంటల్లో అయిపోతుంది... అదే సీరియల్ విషయానికి వస్తే మహిళామణులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ప్రతి రోజు జరుగుతుంది. ఇక ప్రతి రోజు సీరియల్ లో ట్విస్టులు ఉంటాయి... ప్రతిరోజు కావాల్సినంత ఎమోషన్ ఉంటుంది.. ప్రతిరోజు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందుకే రెండున్నర గంటల సినిమాలకంటే సంవత్సరాలపాటు సాగిపోయే సీరియల్లో పై నే మహిళలు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. అందుకే ప్రస్తుతం తెలుగులో స్టార్ ఛానల్స్ ఐనా... మా టీవీ, జీ తెలుగు,  జెమిని,  ఈటీవీ లలో ఎక్కువగా సీరియల్స్ పైనే దృష్టి పెడుతూ ఉంటాయి. 

 

 

 కొన్ని ఛానళ్లు పొద్దస్తమానం సీరియల్స్ నే టెలికాస్ట్ చేస్తుంటే కొన్ని సాయంత్రం కాగానే మహిళామణులు టీవీలకు అతుక్కుపోయేలా సీరియల్స్ ని టెలికాస్ట్ చేస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం అన్ని చానల్లో సీరియల్స్ వస్తూ ఉన్నాయి. అయితే అన్ని ఛానళ్లలో కంటే ఎక్కువగా మహిళా మణులను ఆకర్షిస్తూ రోజురోజుకు... టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న బుల్లితెర సీరియల్ మా టీవీలో ప్రసారమయ్యే కార్తీకదీపం. అయితే అటు మాటీవీ తో పాటు వివిధ చానళ్లలో కూడా ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి... అంతే కాకుండా మరెన్నో కొత్త సీరియల్స్ కూడా టెలికాస్ట్ అవుతున్నాయి. కానీ కార్తీకదీపం సీరియల్ కి ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. మహిళ మణులే  కాకుండా బుల్లితెర ప్రేక్షకులందరికీ కార్తీకదీపం సీరియల్ ఎంతగానో ప్రభావితం చేస్తోంది. 

 

 

 ముఖ్యంగా ఈ సినిమాలో వంటలక్క డాక్టర్ బాబు పాత్రలు బాగా ఫేమస్ అయ్యాయి అనే చెప్పాలి. ఈ రెండు పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోయాయి. దీంతో కార్తీకదీపం సీరియల్ వస్తుంది అంటే చాలు ఎన్ని పనులున్నా వాటన్నింటినీ వదిలేసి టీవీల ముందుకు వచ్చి కూర్చుంటారు ప్రేక్షకులు. ఇక ఆ సమయంలో ఎవరైనా ఛానల్ మార్చారు అంటే ఇక వాళ్ళ పని అయిపోయినట్టే. ఇలా ఎన్ని కొత్త సీరియల్స్ వస్తున్నా ఎన్నో రోజుల నుండి కార్తీకదీపం సీరియల్ బుల్లితెర టాప్ రేటింగ్ సీరియల్ గా దూసుకుపోతుంది. ఈ వారం ఈ సీరియల్ ఏ స్టార్ సీరియల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: