కూతురి మీద ప్రేమ.. ఆ కూతురు జీవితాన్ని మధ్యలోనే అంధ కారం చేయడమే కాకుండా చివరకు ఆ తండ్రి ప్రాణాలు తీసుకునేలా చేసింది. తన కూతురు ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని మారుతి రావు కిరాయి హంతకులతో ప్రణయ్ ను దారుణంగా చంపించాడు. ఆ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మారుతి రావు బెయిల్ పై బయట ఉన్నారు. ప్రేమించిన కూతురు పెళ్లిని యాక్సెప్ట్ చేయలేక తన కూతురు తాళిని తెంచాలని అనుకున్న మారుతి రావు తండ్రిగా అప్పుడే మరణించాడు.      

            

ఇక బెయిల్ పై తిరిగుతున్న మారుతి రావు అమృత కేసు వాపసు తీసుకుంటే ఆస్తి మొత్తం ఆమె పేరు మీద రాస్తా అని రాయభారం పంపించడంతో.. మళ్ళీ అమృత అతని మీద కేసు పెట్టింది. అందుకే ఆయన్ను మళ్ళీ రిమాండ్ లో తీసుకున్నారు. మళ్ళీ బెయిల్ పై బయటకు వచ్చిన మారుతి రావు ఆదివారం ఖైరతాబాద్ ఆర్య వైశ్య భవన్ లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కూతురు దూరమైందన్న మనస్తాపం వల్లే మారుతి రావు ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు.

 

ఈమధ్యనే మారుతి రావు ఫామ్ హౌజ్ లో ఓ కుళ్ళిపోయిన శవం పోలీసులు గుర్తించారు. అయితే మారుతి రావుకి తెలియకుండా తన ఫామ్ హౌజ్ లో శవం ఉండే ఛాన్స్ లేదు. అన్ని విధాలుగా ఉచ్చు బిగిస్తుండటంతో మారుతి రావు ఇలా సూసైడ్ చేసుకున్నారని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఆరోజే తండ్రిగా జరిదిందేదో జరిగింది అని పెద్ద మనసు చేసుకుని ఉంటే అల్లుడి ప్రాణం.. అమ్మాయి సంతోషం.. చివరకు తన ప్రాణం కూడా తీసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. పరువు ప్రతిష్టలకు వెళ్లి చివరకు వాటి కోసమే తన ప్రాణం కూడా బాలి చేసుకున్నాడు. ప్రస్తుతం మారుతి రావు సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు.. ఎలా చేసుకున్నాడు అన్న విషయాల మీద పోలీసులు విచారణ జరుపుతున్నారు.      

మరింత సమాచారం తెలుసుకోండి: