ప్రొడ్యూసర్లలో కూడా బినామీల గోల తప్పడం లేదని వాపోతున్నారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన అతిపెద్ద భారీ ప్రాజెక్ట్ "బాహుబలి". ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ మారిపోయిందనుకోండి. అయితే.. ఇప్పుడు తెరకెక్కించే టాప్ హీరోల చిత్రాలను దాంతో పోటీగా చేస్తున్నారు ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే భారీగా తెరకెక్కించే చిత్రాలకు లెక్కలు పెరిగిపోయాయి.

 

 

దీంతో టాలీవుడ్ లో బినామీల హల్ చల్ ఎక్కువ అయింది. రియల్ ప్రొడ్యూసర్స్ కంటే యాక్టింగ్ ప్రొడ్యూసర్స్ కే టెక్కు ఎక్కువ అన్నట్లు ప్రవర్తిస్తున్నారట. మన తెలుగు సామెత ప్రకారం అసలు కంటే కొసరుకు ఉలుకెక్కువ అన్నమాట. 

 

 

అయితే గత నాలుగు సంవత్సరాల క్రితం తెలుగు ఇండస్ట్రీలోకి ఫ్రీ లాన్సర్ ఫిల్మ్ జర్నలిస్ట్ గా, రివ్యూ రైటర్ గా ఫిల్మ్ మీడియాలో ఓ వ్యక్తి అడుగు పెట్టాడు. అయితే ఇప్పుడు అతను సినిమాలను కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ ఘటన పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు ఓ సాధారణ ఫిల్మ్ జర్నలిస్ట్ భారీ చిత్రాలను నిర్మించటం ఏంటనే ప్రశ్న లేవనెత్తారు కొందరు. దీంతో ఆగకుండా అసలు మాటర్ ఏంటని ఆరా తీయటం మొదలు పెట్టారు.  అప్పుడు అసలు నిజం బయటపడింది. కొంతమంది పొలిటికల్ లీడర్స్ కి అతను భినామి అని తేలింది.

 

 

అయితే.. ఇతను గతంలో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా వ్యవహరించి ఓ నాయకుడికి బండ్ల గణేష్ వ్యవహరించిన తరహాలోనే ఈ ఫ్రీ లాన్సర్ జర్నలిస్ట్ కూడా అలానే వ్యవహరిస్తున్నాడని తేలింది. కాగా., ఇతను ముఖ్యంగా కొంతమంది పొలిటికల్ లీడర్స్ కి, అధికార పార్టీకి చెందిన భినామీగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది అవార్డును అందుకున్న నటితో ఓ మహిళ ప్రధాన చిత్రాన్ని నిర్మిస్తున్నాడని సమాచారం. ఇలా వరుస సినిమాలను నిర్మిస్తున్న సదరు ఫ్రీ లాన్సర్ కి ఇన్ని డబ్బులు ఎలా వస్తున్నాయి అనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికీ అతనేవ్వరనేది మీకు అర్ధమయ్యే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: