ప్రపంచ వ్యాప్తంగా ఓ వైపు కరోనా భయం పట్టుకుంటే.. మరోవైపు కొత్త కొత్త రోగాలు వస్తూ జనాలను భయపెడుతున్నాయి.  ఆ మద్య తూగో జిల్లాలో కోళ్లకు కొత్త రకం వ్యాధి సోకి చనిపోయిన విషయం తెలిసిందే.  భారత్ లో కరోనా కేసులు 31 కి చేరకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కరోనానే కాదు కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్  సోకుతుందని వార్తలు వస్తున్నాయి.  భారత్ లో మొదట కరోనా కేసు కేరళాలలో నమోదు అయ్యింది.  ఆ తర్వాత భారత్ లో వివిధ చోట్ల ఈ కేసులు నమోదు అయ్యాయి.  ఇప్పుడు కేరళాలలోనే కోళ్లకు భారీ నష్టం వచ్చేలా ప్రమాదం ముంచుకు వస్తుంది. కోళ్ల బర్డ్ ఫ్లూ వైరస్  సోకినట్లు వార్తలు వస్తున్నాయి. 

 

కరోనా వైరస్ కారణంగా ఆందోళనకరమైన వాతావరణం నెలకొనడం, మాంసం వినియోగానికి జనం దూరంగా ఉండటం నేపథ్యంలో బర్డ్ ఫ్లూ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఎలాంటి ఆందోళన వద్దని, ఇతర ప్రాంతాలు ఆ వైరస్ విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నామని కేరళ సర్కారు ప్రకటించింది. కేరళాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని రోజు ల నుంచి కోళ్ల పరిశ్రమకు పెద్ద దెబ్బ పడుతుంది.  కోడి కూడా రేట్లు కూడా భారీతా తగ్గిపోయింది.  కేరళలోని కజికోడ్ జిల్లా పరిధిలో ఉన్న రెండు భారీ కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్టుగా గుర్తించామని కేరళ అటవీ, పశుసంవర్థక శాఖ మంత్రి కె.రాజు వెల్లడించారు.

 

బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్టు ల్యాబ్ నిర్ధారించిందని తెలిపారు. వెంటనే దగ్గరిలోని అన్ని పౌల్ట్రీ ఫారాలను మూసివేశామని, కోళ్లను చంపేసి, పూడ్చిపెట్టాలని ఆదేశించామని వెల్లడించారు. ఇందుకోసం 25 బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. గత కొన్ని రోజులుగా కేరళాకు ఎన్నో రకాలుగా నష్టాలు వాటిల్లుతున్నాయి. భారీ వర్షాలు, కరోనా, కోళ్ల బర్డ్ ఫ్లూ వైరస్  ఇలా వరుస వస్తున్న ఇబ్బందులతో కష్టాలు పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: