భారత దేశంలో గత సంవత్సరం జరిగిన పుల్వామా దాడి ఒక్కసారిగా దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. భారత్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు పక్కా ప్లాన్ తో  40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వెళ్తున్న కాన్వాయ్పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో... ఈ దుర్ఘటనలో ఒక ఉగ్రవాది తో పాటు 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. ఈ ఘటన భారతదేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు  గురి చేసింది. అయితే పుల్వామా  టెర్రర్ ఎటాక్ తో సంబంధం ఉన్న ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నారు కాశ్మీర్ పోలీసులు. మొన్నటికి మొన్న ఒక సాదా సీదా వ్యాపారిగా కాశ్మీర్లో కొనసాగుతూ... పుల్వామా దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు సహాయం చేసిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. 

 

 

 ఇక తాజాగా పుల్వామా  టెర్రర్ ఎటాక్ తో సంబంధం ఉన్న మరో ఇద్దరిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది. వాజ్ ఉల్  ఇస్లాం... మహమ్మద్ అబ్బాస్ లను శుక్రవారం అదుపులోకి తీసుకుంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇందులో 19 ఏళ్ల వాజ్ ఉల్  ఇస్లాం... టెర్రరిస్టులు జవాన్లపై దాడి కి ఉపయోగించిన బాంబు సహా ఇతర మెటీరియల్ అంతా... సమకూర్చాడు అన్నది విచారణలో వెల్లడైంది. ఐఈడి బాంబుకు తయారీకి కావలసిన కెమికల్స్ బ్యాటరీ ఇతర మెటీరియల్ అంతా... ఆన్లైన్ రిటైలర్ షాపింగ్ యాప్ అమెజాన్ సైట్ ద్వారా కొన్నట్లు పోలీసులకు చెప్పాడు వాజ్  ఉల్  ఇస్లాం. 

 

 

 అయితే ఈ మెటీరియల్ ను కొనడానికి అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ అకౌంట్ ను  ఉపయోగించాలంటూ  జైషే మహమ్మద్  టెర్రరిస్టు ఇచ్చిన సూచనల మేరకు.. తాను  ఇదంతా చేశాను అంటూ విచారణలో ఒప్పుకున్నాడు సదరు యువకుడు. అంతేకాదు అమెజాన్ లో కొనుగోలు చేసిన మెటీరియల్ ను  వాచ్ ఉల్...  స్వయంగా జైషే మహ్మద్ ఉగ్రవాదులకు చేర వేసినట్లు విచారణలో అంగీకరించాడు. అయితే రా మెటీరియల్ ఉపయోగించి చేసే ఐఈడి  బాంబు తయారు చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ బాంబు తయారీలో మహమ్మద్ అబ్బాస్  అనే వ్యక్తి కూడా కీలకంగా వ్యవహరించారు. అతనికి 2018 నుంచి మహమ్మద్ అబ్బాస్ అనే వ్యక్తి షెల్టర్ ఇచ్చినట్టు గుర్తించారు. అంతేకాదు జవాన్ల  కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడికి పాల్పడిన వారికి కూడా అబ్బాస్ సహకరించటం... గత కొన్నేళ్ల నుంచి జేషే కోసం పని చేస్తున్నట్లుగా అబ్బాస్ విచారణలో అంగీకరించాడు. అయితే వీరిని వెంటనే స్పెషల్ కోర్టులో ప్రవేశపెడతామంటూ  పోలీసులు వెల్లడించారు. కాగా టెర్రరిస్ట్ అటాక్ సహకరించిన ఐదు మందిని  ఇప్పటి వరకు అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: