ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు శనివారం ఉదయం 11:30 గంటల నుంచి మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను మొదటిసారి హరీష్ రావు ప్రవేశపెడుతున్నారు. అయితే గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన సమయంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గా కొనసాగిన హరీష్ రావు.. తర్వాత తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక ఆర్థిక శాఖ మంత్రి హోదాలో తాజాగా హరీశ్ రావు అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు. ఇప్పటికే ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 

 

 

 అన్ని వర్గాల సంక్షేమం అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా.. ఆర్థిక బడ్జెట్ను రూపొందించినట్లు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. తనకు అసెంబ్లీ వేదిక రాష్ట్ర బడ్జెట్ ను  ప్రవేశపెట్టే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది అంటూ హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ అంటే కేవలం కాగితాల లెక్కలు మాత్రమే కాదని సామాజిక స్వరూపం అంటూ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హోదాలో హరీష్ రావు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతుండగా...  శాసన మండలిలో శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు. 

 

 

 అయితే అసెంబ్లీలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్న మంత్రి హరీష్ రావు.. ఏ శాఖలకు బడ్జెట్ లో ఎంత కేటాయింపులు ఉన్నాయి అనే విషయాన్ని తెలిపారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ బడ్జెట్ రూ.1,82,914.42 కోట్లు. రెవిన్యూ వ్యయం. రూ.1,38,669.82 కోట్లు. క్యాపిటల్ వ్యయం రూ.22,061.18 కోట్లు. రెవెన్యూ మిగులు రూ.4,482.12 కోట్లు. ఆర్థిక లోటు రూ.33,191.25 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: