తెలంగాణ‌ రాష్ట్ర శాసనసభలో బడ్జెట్‌ 2020-21 ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టారు. మంత్రి హరీష్‌రావు తొలిసారిగా సభలో బడ్జెట్‌ ప్రంసంగాన్ని చదివి వినిపించారు. ఇక శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బ‌డ్జెట్‌ను వాస్త‌విక అంచ‌నాల‌తో రూపొందించిన‌ట్లు మంత్రి హ‌రీశ్‌రావు శాస‌న స‌భ‌లో ప్ర‌క‌టించారు. ప్ర‌తికూల‌, అనుకూల ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా, ఎక్క‌డ కూడా సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ఆటంకం క‌ల‌గ‌కుండా నిధుల కేటాయింపులు జ‌రిపిన‌ట్లు ఆయ‌న ప్ర‌ట‌కించారు. ప్ర‌ధానంగా, సంక్షేమం, రైతు, వ్య‌వ‌సాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది.



- రూ. 1,82,914.42 కోట్లతో బడ్జెట్
-రైతు రుణమాఫీకి రూ. 6,225 కోట్లు..
-రైతుబంధు పథకం కోసం రూ. 14 వేల కోట్లు.
-రైతు బీమా కోసం రూ. 1,141 కోట్లు.
-సాగునీటి రంగానికి రూ. 11,054 కోట్లు..
-రైతు వేదికల నిర్మాణం కోసం రూ. 350 కోట్లు..
-ఒక్కో రైతు వేదికకు రూ. 12 లక్షలు కేటాయింపు..
-బిందు, తుంపర సేద్యానికి రూ. 600 కోట్లు.
-విత్తనాల సబ్సిడీకి రూ. 142 కోట్లు..
-పాడి రైతుల ప్రోత్సాహం కోసం రూ. 100 కోట్లు..
-మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ కోసం రూ. 1000 కోట్లు.
.....................................................
-విద్యుత్‌ శాఖకు రూ. 10,416 కోట్లు.

........................................................

సంక్షేమ పథకాలు..
-ఆసరా పెన్షన్లకు రూ. 11,758 కోట్లు.
-ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 16,534.97 కోట్లు.
-ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 9,771.27 కోట్లు.
-మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం రూ. 1,518.06 కోట్లు.

విద్యా రంగం
-ఫీజు రియింబర్స్‌మెంట్‌ కోసం రూ. 2,650 కోట్లు.
-పాఠశాల విద్యాశాఖకు రూ. 10,421 కోట్లు.
-ఉన్నత విద్యాశాఖకు రూ. 1,723.27 కోట్లు.
-సంపూర్ణ అక్షరాస్యత కోసం రూ. 100 కోట్లు.
........................................................

వైద్య రంగం
-వైద్య రంగానికి రూ. 6,186 కోట్లు.
................................................

వెనుకబడిన తరగతుల కోసం..
-వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం రూ. 4,356.82 కోట్లు
-పశు పోషణ, మత్స్యశాఖకు రూ. 1,586.38 కోట్లు.
-కల్యాణలక్ష్మి - బీసీల కోసం అదనపు నిధుల కింద రూ. 1,350 కోట్లు.
-ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ. 500 కోట్లు.
-మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ. 1,200 కోట్లు.


ప‌ట్ట‌ణ‌, గ్రామీణాభివృద్ధికి..
-పంచాయతీరాజ్‌  గ్రామీణాభివృద్ధి కోసం రూ. 23,005 కోట్లు.
-పట్టణ మిషన్‌ భగీరథ పథకం కింద మిగిలిపోయిన 38 మున్సిపాలిటీలకు రూ. 800 కోట్లు.
-మున్సిపల్‌ శాఖకు రూ. 14,809 కోట్లు.
-హైదరాబాద్‌ నగరంలో ప్రాజెక్టుల అమలు కోసం రూ. 10 వేల కోట్లు.


-ఇండస్ట్రీయల్‌ ఇన్సెంటివ్స్‌ కోసం రూ. 1,500 కోట్లు.
-పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం రూ. 1,998 కోట్లు.

-ఆర్టీసీకి రూ. 1000 కోట్లు.

-గృహ నిర్మాణాల కోసం రూ. 11,917 కోట్లు.

-పర్యావరణ, అటవీశాఖకు రూ. 791 కోట్లు.

-దేవాలయాల అభివృద్ధి కోసం రూ. 500 కోట్లు.

-కలెక్టరేట్లు, డీపీవోలు, పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణాలను పూర్తి చేయడం కోసం రూ. 550 కోట్లు.

-రోడ్లు, భవనాల శాఖకు రూ. 3,494 కోట్లు.

-పోలీసు శాఖకు రూ. 5,852 కోట్లు.

-ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎన్డీపీ నిధుల కోసం రూ. 480 కోట్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: