రెండేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతి రావు ఆత్మహత్య చేసుకోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేది ఎవరికి అర్ధం కాని పరిస్థితి. పోలీసులు కూడా ఈ ఆత్మహత్య విషయంలో ఏ విధమైన అంచనాకు రాలేకపోతున్నారు. దీనిపై ఇప్పటికే తెలంగాణా పోలీసులు విచారణ ముమ్మరం చేసినా సరే ఏ ఆధారాలు కనీసం ప్రాధమిక ఆధారాలు కూడా దొరకడం లేదని అంటున్నారు. ఆస్తి వివాదాలే దీనికి కారణమని అంటున్నారు. 

 

మారుతి రావు కి వందల కోట్ల ఆస్తి ఉంది. ఈ ఆస్తి కోసం ఆయన సోదరుడు ఒత్తిడి చేయడం ప్రణయ్ హత్య కేసులో విచారణ అనేది తుది దశకు చేరుకొని శిక్ష ఖరారు అవుతున్న తరుణంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే మారుతి రావు మృత దేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో మారుతీరావు మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించి, భార్య గిరిజకు పోలీసులు మృత దేహాన్ని అప్పగించారు. మారుతీరావు మృతదేహాన్ని ఆయన స్వగ్రామం నల్గొండ జిల్లా మిర్యాలగూడకు తరలిస్తున్నారు.

 

అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి అనేది స్పష్టత రావడం లేదు. రేపు నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. విదేశాల్లో బంధువులు ఉన్న నేపధ్యంలో వారు వచ్చే అవకాశం ఉందని మంగళవారం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎం వచ్చింది అనేది తెలియడం లేదు. అమృత ఇంటి వద్ద పోలీసులు అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను పెంచారు. ఆయన తమ్ముడు శ్రవణ ని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని, విచారణకు పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారా లేక విషం తీసుకున్నారా అనేది స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: