పుష్కరకాలం నాటి తిరుపతి వాసుల కల నేరవేరబోతోంది. తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో నగర వాసుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. గత కొన్నేళ్లుగా  కార్పొరేషన్‌గా ఎదిగిందే తప్పా, పాలకవర్గం మాత్రం కొలువుదీరలేదు. స్ధానిక సంస్ధల ఎన్నికల కోలాహలంతో ఆధ్మాత్మిక రాజధానిలో రాజకీయ వేడి మొదలైంది. 

 

ప్రపంచ ఆధ్యాత్మిక నగరం తిరుపతి నగరానికి మేయర్‌ కరువయ్యాడు. కార్పొరేషన్‌ హోదా లభించి సంవత్సరాలు గడుస్తున్నా కోర్టులో కేసులంటూ ఎన్నికలు నిర్వహించటానికి గత ప్రభుత్వం సాహసం చేయలేకపోయింది. చివరకు గతేడాది ఎన్నికలు ఉంటాయని హడావుడి చేసింది. డివిజన్ల రిజర్వేషన్లు కూడా ప్రకటించి చివరకు చేతులెత్తేసింది. 

 

మున్సిపాలిటీగా ఉన్న తిరుపతికి పదహారేళ్ల కిందట 2002 జనవరి 28న ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో కందాటి శంకర్‌రెడ్డి చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. 2007 ఫిబ్రవరి 5 నాటికి మున్సిపల్‌ పాలకమండలి పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత మేజర్‌ మున్సిపాలిటీలను కార్పొరేషన్‌ హోదా కల్పించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 2007 మార్చి 31న ఎంఆర్‌ పల్లి, రాజీవ్‌నగర్, తిమ్మినాయుడుపాలెం పంచాయతీలను ప్రభుత్వం మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. అనంతరం 2009లో తిరుపతి మున్సిపాలిటీకి కార్పొరేషన్‌ హోదా కల్పించింది. ఆ తర్వాత డివిజన్ల విభజన, ఓటర్ల నమోదు కార్యక్రమాలు చేపట్టారు. ఇలా అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకున్నా  వైఎస్‌ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో కార్పొరేషన్‌ ఎన్నికలకు గ్రహణం పట్టింది. 

 

2007లో నగరపాలికగా ఉన్నతీకరించాక.. ఒక్క ఎన్నిక జరగలేదు. 12 ఏళ్ల తర్వాత ప్రక్రియ చేపట్టడంతో.. అధికారులు పోలింగ్‌ బూత్‌ల విభజనతో పాటు వార్డుల, కులాల వారీగా ఓటరు జాబితాను ఇటీవలే రూపకల్పన చేశారు. 1992 నుంచి 2002 వరకూ పురపాలికకు పాలకమండలి లేకపోగా, 2007 నుంచి నేటి వరకూ తిరుపతి నగరపాలికకు పాలకమండలి లేకపోవడంతో అధికారులే పాలిస్తున్నారు. 

 

తిరుపతి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మారి నేటికి సరిగ్గా 12 ఏళ్లు ముగిశాయి. ఇంతకాలం ఎన్నికలపై చర్చలే తప్ప అడుగులు పడలేదు. పాలకమండలి లేనందున ఆధ్యాత్మికనగరికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన కోట్లాది రూపాయల నిధులు దక్కలేదు. ప్రస్తుతం న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడం, ఓటరు జాబితా, వార్డుల విభజన ప్రక్రియ ముగియడంతో ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.వార్డుల వారీగా సీట్ల కేటాయింపు చేసింది ప్రభుత్వం..మొత్తం నగరంలో యాబై వార్డులు ఉండగా ఎస్టీలకు ఒకటి,ఎస్సీలకు 5 ,బిసిలకు 17,జనరల్ మహిళకు 15,అన్ రిజర్వడ్ కింద 12 స్ధానాలకు కేటాయించింది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ముఖ్యమంత్రి అయిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, విభజన తర్వాత సీఎం అయిన ప్రస్తుత మాజీ సిఎం చంద్రబాబు తిరుపతి కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు సాహసం చేయలేకపోయారు. 

 

ఎన్నో ఎళ్లేగా అధికారులు ఎలుబడిలోనే కార్పోరేషన్ కోనసాగుతూ వచ్చింది. ఇనాళ్ళకు తిరుపతి వాసులు కల ప్రభుత్వం నేరవేరుస్తోందని సంతోషంగా ఉన్నారు నగర వాసులు. దీని వల్ల తిరుపతి మరింత అభివృద్ది చెందుతుందని ఆశగా ఉన్నారు. ఇక పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నేతల్లో ఉత్సహం కనిపిస్తోంది. ఇనాళ్ళకు పదవులు అలంకరించే అవకాశం రావడంతో ఆనందంలో ఉన్నారు పార్టీల నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: