హోలీ అంటేనే రంగులు... చిరునవ్వులు.. పరుగులు.. సందళ్లు..!! చిన్నాపెద్దా తేడా లేకుండా రంగుల్లో మునిగి తేలే సంబరాల కేళి. కానీ.. ఈ ఏడాది హోలీపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో.. నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే షాపింగ్‌ మాల్స్‌, సినిమా హాల్స్‌ వంటి జనసమూహ ప్రదేశాలు, మెట్రో రైల్‌, బస్సు ప్రయాణాలకు దూరంగా ఉంటున్న జనాలు... హోలీ సెలబ్రేషన్స్‌కు కూడా నో చెబున్నారు. 

 

హైదరాబాద్ నగరంలో.. సందర్భమేదైనా.. సంబరాలు అంబరాన్నంటాల్సిందే. ఇక హోలీ సెలబ్రేషన్స్‌కు అడ్డూ అదుపే ఉండదు. హోరెత్తించే డీజేలు, రెయిన్‌ డ్యాన్స్‌, మడ్‌ డ్యాన్స్‌, రకరకాల థీమ్‌లతో ఈవెంట్స్‌ సందడి అంతా ఇంత కాదు. కానీ.. ఈ ఏడాది హోలీకి కరోనా వైరస్‌ పట్టుకుంది. హోలీకి రెండు రోజులే ఉన్నా... ఎలాంటి సందడి కానరావటం లేదు. 

 

ఎప్పటిలాగే ఈ ఏడాది హోలీ ఈవెంట్స్‌ నగరంలో ఏర్పాటవుతున్నాయి. ఒక్కో ఈవెంట్‌ ఒక్కో థీమ్‌తో గెట్‌ రెడీ అంటున్నా.. నగరవాసుల నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ లేదు. ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి హైదరాబాద్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వడంతో... భయాందోళన చెందుతున్నారు జనాలు. ఇప్పటికే సినిమా హాల్స్‌, షాపింగ్‌ మాల్స్‌కి వెళ్లడం మానేశారు. సిటీ బస్సులు, మెట్రో రైల్‌లో ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. జనావాస ప్రదేశాలకు వెళ్లడమే మానేశారు. 

 

ఈవెంట్స్‌ ఉన్నా... రెస్పాన్స్‌ లేకపోవడంతో టికెట్లు అమ్ముడుపోవట్లేదు. సిటీలో ఏటా హోలీ ఈవెంట్స్‌ మాదాపూర్‌, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, బేగంపేట్‌, సికింద్రాబాద్‌లో ఎక్కువగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఇవే ప్రదేశాల్లో నిర్వహిస్తున్నా... కరోనా కేసులు, అనుమానిత కేసులు నమోదైదంది కూడా ఈ ఏరియాల్లోనే. రహేజా మైండ్‌ స్పేస్ లో కరోనా కేసు రేపిన అలజడి అంతాఇంత కాదు. ఇప్పటికీ టెక్కీలంతా వర్క్‌ ఫ్రం హోమ్‌లోనే ఉన్నారు. ఇక  హోలీ ఈవెంట్లే కాదు.. సెలబ్రేషన్స్‌కూ నో చెప్తున్నారు. 

 

లక్షలు పెట్టి ఈవెంట్లకు ఏర్పాటు చేసుకున్న ఆర్గనైజర్లు తెల్లమోహం వేశారు. ఇప్పటికే డీజేలు, సౌండ్‌ సిస్టమ్స్‌, ప్లేస్‌ బుకింగ్స్‌ చేసుకున్న వాళ్లంతా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. మరోవైపు ఈ ఏడాది కాకపోయినా వచ్చే ఏడాదైనా హోలీ చేసుకోవచ్చు కానీ.. కోరీ కరోనా తెచ్చుకోవడం ఎందుకనుకుంటున్నారు నగరవాసులు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: