చంద్రబాబునాయుడుతో పచ్చమీడియా అధిపతి వేమూరి రాధాకృష్ణకు ఉన్న బంధం ఏమిటో కొత్తగా చెప్పాల్సన పనిలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశంపార్టీకన్నా వేమూరి వారే ఎక్కువగా పోరాటాలు చేస్తున్నారు. సరే ఈయన పోరాటాలన్నీ కేవలం బురద పూయటానికే పరిమితమైపోతున్నాయి కాబట్టి ఎవరూ పట్టించుకోవటం లేదులేండి. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా చంద్రబాబు తరపున ఈయనగారు తన పోరాటాన్నైతే కంటిన్యూ చేస్తున్నారు లేండి. ఇటుంటి వేమూరి ప్రతి ఆదివారం రాసుకునే కొ(చె)త్త పలుకులో ఇచ్చిన ఓ సలహా చూసి చంద్రబాబుకు కచ్చితంగా షాక్ తగిలే ఉంటుంది.

 

ఇంతకీ ఆ సలహా ఏమిటంటే రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల నుండి తెలుగుదేశంపార్టీ తప్పుకోవాలట. పోటి చేయకుండా దూరంగా ఉండిపోవటమే ఉత్తమమని వేమూరి సలహా ఇచ్చాడు. పోటి నుండి దూరంగా ఉండిపోవటమంటే ఎన్నికలకు భయపడి పారిపోవటం కానే కాదని కాస్త ఊరడింపు మాటలు కూడా చెప్పాడు లేండి. తమిళనాడులో ఒకపుడు జయలలిత కూడా ఇదే విధంగా స్ధానిక సంస్ధల ఎన్నికలకు దూరంగా ఉండి పోయిందట. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లు గుర్తుచేసి చంద్రబాబులో ఆశలు కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు.

 

ఇంతకీ వేమూరి చెప్పిన కారణాలు ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ దెబ్బ నుండి నేతలు ఇంకా కోలుకోలేదట. అప్పుడు చేసిన అప్పుల నుండే బయటపడలేదట. అభ్యర్ధులను ఆదుకునే స్ధితిలో పార్టీ కూడా లేదట. గ్రామాల్లో నేతలు, కార్యకర్తల పరిస్ధితి కూడా దారుణంగా ఉంది కాబట్టి ఎన్నికలకు వాళ్ళంతా వెనకాడుతున్నారట.

 

మొన్నటి ఎన్నికల తర్వాత మంచి ఊపుమీదున్న వైసిపిని తట్టుకోవటం చంద్రబాబుకు ఇపుడు కష్టమే అని వేమూరి ఒక్క మాటలో  తేల్చేశాడు. ఎలాగూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మళ్ళీ పునరావృతమవ్వటం ఖాయమని కూడా వేమూరి జోస్యం చెప్పేశాడు. ఎందుకంటే వైసిపికి ఢీ కొట్టే పరిస్ధితిలో టిడిపి, బిజెపి, జనసేలు కూడా లేవని స్పష్టంగా చెప్పేశారు. నిజానికి ఈ మాటలు చెప్పటానికి వేమూరి ఎంతగా బాధపడుంటారో అర్ధం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడే  ఓ అనుమానం వస్తోంది. వేమూరే తనంతట తానుగా చంద్రబాబుకు సలహా ఇచ్చాడా ? లేకపోతే చంద్రబాబు మనసులోని మాటనే రాధాకృష్ణ బయటపెట్టాడా ? అని.

మరింత సమాచారం తెలుసుకోండి: